రాజకీయాల్లో కొత్త పంథా నడుస్తోంది. ఒకప్పుడు నాయకులంటే ప్రజలతో సంబంధం ఉండేవాళ్లు. ఇప్పుడు లీడర్లు ప్రజలతో కాకుండా, కేవలం ప్రచారంతోనే రాత్రికి రాత్రే అయిపోతున్నారు. ప్లెక్సీల్లోనూ, యూట్యూబ్, అలాగే వివిధ టీవీ ఛానెల్స్‌లో మాట్లాడుతూ ప్రముఖ నాయకులుగా చెలామణి అవుతుండడం చర్చనీయాంశమైంది.
ఇలాంటి వాళ్లే వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు. అదృష్టవశాత్తు వీళ్లు ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీలు అధికారంలోకి వస్తే, పదవులు కూడా వరిస్తుంటాయి. దీంతో నిత్యం ప్రజల్లో ఉంటూ, ఖర్చులు పెట్టుకునే నిజమైన నాయకులు ఎవరికీ తెలియని అనామకులుగా మిగిలిపోతున్నారు. అనర్హులంతా లబ్ధి పొందుతుంటే, నిఖార్సైన సైనికులైన తమను పట్టించుకోలేదని ఆవేదన చెందుతుంటారు.
ఒకవేళ తాము ప్రాతినిథ్యం వహించే పార్టీ అధికారం కోల్పోగానే, అడ్రస్ లేకుండా పోతుంటారు. లేదంటే అధికార పార్టీలో చేరిపోతుంటారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ల పనే రాజకీయాల్లో బాగుందనే మాట వినిపిస్తోంది. ఆర్థికంగా లబ్ధి పొందుతూ, లాబీయిస్టులుగా మారి, అధికారం ఎక్కడుంటే, అక్కడ వాలిపోతుండడంపై జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అధికారం ఉన్నప్పుడు ఏ మాత్రం ప్రయోజనం పొందని నాయకులు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం తాము గుర్తుకు వస్తుంటామని వాపోతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ప్లెక్సీలు, మీడియా లీడర్లదే కాలమైన దుస్థితి ఏర్పడింది.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
Yellow Tie pettav ? yenduku GA ?
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ