కాకాణి అరెస్ట్ వ‌ర‌కూ వెళ్తారా?

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిపై కేసు న‌మోదైంది.

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిపై కేసు న‌మోదైంది. పోలీసుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలోని కోళ్ల‌దిన్నె టీడీపీ నాయ‌కుడు వంటేరు ప్ర‌స‌న్న‌కుమార్ కావ‌లి వ‌న్‌టౌన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణిపై వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం.

వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు న‌మోదు చేస్తున్న పోలీసుల‌కు ఇటీవ‌ల కాకాణి ఘాటు హెచ్చ‌రిక చేశారు. రానున్న‌ది త‌మ ప్ర‌భుత్వ‌మే అని, టీడీపీ నేత‌ల మెప్పుకోసం అక్ర‌మ కేసులు న‌మోదు చేసే పోలీసుల్ని ఎక్క‌డున్నా తీసుకొచ్చి బ‌ట్ట‌లూడ‌దీసి నిల‌బెడ‌తామ‌ని ఆయ‌న సంచ‌ల‌న హెచ్చ‌రిక చేశారు. కాకాణి ఘాటు కామెంట్స్‌పై న్యాయ నిపుణుల స‌ల‌హా తీసుకుంటున్నామ‌ని డీజీపీ ద్వార‌కాతిరుమ‌ల‌రావు చెప్పారు.

పోలీసుల‌పై అనుచిత వ్యాఖ్య‌ల్ని కాకాణి చేస్తే, బాధితులైన వాళ్లు ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పోలీసుల‌కు బ‌దులుగా టీడీపీ గ్రామ నాయ‌కుడు ఫిర్యాదుపై పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం ఏంట‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. సంబంధం లేని అంశాల్లో పోలీసులు కేసులు న‌మోదు చేయ‌డం వ‌ల్లే కాకాణి మండిప‌డ్డార‌ని గుర్తు చేస్తున్నారు.

అయితే కాకాణిని అరెస్ట్ చేసే వ‌ర‌కూ పోలీసులు వెళ్తారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. కాకాణిపై కూట‌మి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప‌లు కేసులు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే కాకాణి మాత్రం భ‌య‌ప‌డేది లేద‌ని తేల్చి చెప్పారు. రానున్న రోజుల్లో ఇంకెన్ని కేసులు న‌మోదు చేస్తారో చూడాల‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

4 Replies to “కాకాణి అరెస్ట్ వ‌ర‌కూ వెళ్తారా?”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.