ఐటీ దాడులు.. సుకుమార్ పై కూడా!

చిత్ర పరిశ్రమలో వరుసగా రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి.

చిత్ర పరిశ్రమలో వరుసగా రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి దర్శకుడు సుకుమార్ కూడా చేరాడు. నిన్నట్నుంచి అతడి ఇల్లు, ఆఫీసుల్లో కూడా సోదాలు నడుస్తున్నాయి.

పుష్ప-2 తీసింది ఈ దర్శకుడే. రెమ్యూనరేషన్ కాకుండా, లాభాల్లో వాటా తీసుకున్నాడనే ప్రచారం ఇతడిపై జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో సుకుమార్ దిగిన వెంటనే, అతడ్ని తీసుకొని నేరుగా సుకుమార్ రైటింగ్స్ ఆఫీస్ కు, అట్నుంచి అటు అతడి నివాసానికి అధికారులు తీసుకొని వెళ్లారు.

ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఆఫీసులు, ఇళ్లపై ఈరోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ‘పుష్ప-2’ నిర్మించడానికి డబ్బు ఎక్కడ్నుంచి తీసుకొచ్చారనే అంశం నుంచి మొదలుపెట్టి, సినిమాకు ఎన్ని వసూళ్లు వచ్చాయి, కలెక్షన్లకు తగ్గట్టు ఆదాయపు పన్ను చెల్లించారా లేదా అనే విషయాలన్నింటినీ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కీలక పత్రాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

అటు దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులపై కూడా సోదాలు కొనసాగుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు ఎంత ఖర్చుపెట్టారు, ఆ డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందనే కోణంలో డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఓ కార్పొరేట్ కంపెనీతో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు దిల్ రాజు. ఆ కంపెనీకి చెందిన పత్రాలు, వాటి లావాదేవీల్ని కూడా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అటు దిల్ రాజు వ్యాపార భాగస్వామి మ్యాంగో రామ్ ఆఫీసు, ఇంటిపై ఈరోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

నిన్న ఉదయం 6 గంటలకు మొదలైన ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు.. ఈరోజంతా కొనసాగబోతున్నాయి. అధికారులు అడిగిన పత్రాలన్నింటినీ నిర్మాతలు వెంటవెంటనే అందిస్తే ఓకే, లేదంటే రేపు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. మైత్రీ నిర్మాతలు, దిల్ రాజుకు చెందిన వ్యక్తిగత బ్యాంకు లావాదేవీలన్నింటినీ నిన్ననే కొలిక్కి తీసుకొచ్చారు అధికారులు.

8 Replies to “ఐటీ దాడులు.. సుకుమార్ పై కూడా!”

  1. దెబ్బలు పాడుతాయ్ రో సామి దెబ్బలు పాడుతాయ్ రో song గుర్తుకు వచ్చింది

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  4. ఇండియా లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కి 10% కంటే ఎక్కువ టాక్స్ అడిగితే అది దోపిడి కిందే లెక్క.

Comments are closed.