ఉచిత పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలట!

తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారిగా పార్టీని అధికారంలోకి తెచ్చాడన్న అభిమానం బాగా ఉంది.

కాంగ్రెస్ పార్టీలో అంటే పార్టీ అధిష్టానంలో తెలంగాణలోని మరే కాంగ్రెస్ నాయకుడికీ దక్కని ప్రాధాన్యం సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతోంది. కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగిన నాయకుల కంటే వలస నాయకుడైన రేవంత్ రెడ్డికి అధిష్టానం చాలా విషయాల్లో ప్రాధాన్యం ఇస్తోంది.

కారణం.. తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారిగా పార్టీని అధికారంలోకి తెచ్చాడన్న అభిమానం బాగా ఉంది. అందులోనూ ఆరు గ్యారంటీలు బ్రహ్మాండంగా అమలు జరుగుతున్నాయని, ఉచిత పథకాలతో పేదలు సంతోషంగా ఉన్నారని అధిష్టానం నమ్ముతోంది.

అందుకే రేవంత్ రెడ్డి సీఎంగానే కాకుండా పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగాడు. ఆయనపై రాహుల్ గాంధీకి బాగా నమ్మకం. అందుకే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా ప్రచారానికి రేవంత్ రెడ్డిని పంపుతున్నారు. చివరకు ప్రియాంకా గాంధీ పోటీ చేసిన వాయనాడ్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ రేవంత్ పాల్గొన్నాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఆయనకు కీలక పాత్ర ఇచ్చారు.

అంటే స్టార్ క్యాంపైనర్ గా నియమించారు. ఆయనతోపాటు మరో 39 ప్రధాన ప్రచారకర్తలు ఉన్నారు. ప్రస్తుత కాలంలో ప్రచారంలో ఉచిత పథకాల హామీలు ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఎలా అమలు చేస్తారన్న సంగతి తరువాత. ముందైతే ఓటర్లను ఆకర్షించాలి కదా. ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ ఉచిత హామీలు బాగానే ఇస్తున్నాడు. బీజేపీ కూడా అనేక ఉచిత హామీలు ఇచ్చింది.

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువ తినలేదు కదా. తెలంగాణలో, కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి కారణం ఉచిత పథకాల హామీలే. నిజానికి ఈ హామీలను అమలు చేయడం ప్రభుత్వాలకు భారమవుతోంది. చివరకు ప్రజలపై ఏదో మార్గంలో భారం మోపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు పథకం విషయంలో ఇదే జరిగింది. ఉచిత ప్రయాణం భారం మోయడానికి బస్సు చార్జీలు పెంచక తప్పలేదు. ఈ విషయం అలా ఉంచితే .. ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు తెలంగాణలో బాగా అమలు జరుగుతున్నాయని నమ్ముతున్న రాహుల్ గాంధీ ఢిల్లీ ఓటర్లకు ఆ పథకాల గురించి అర్థమయ్యేలా చెప్పాలని రేవంత్ రెడ్డిని కోరాడు.

తెలంగాణలో అమలు చేస్తున్న తీరును వివరించాలని చెప్పాడు. ఈ పథకాల అమలు వల్ల తెలంగాణ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఢిల్లీ ఓటర్లకు వివరించాలన్నాడు. అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో రేవంత్ రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడన్న మాట.

3 Replies to “ఉచిత పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలట!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  3. ఉచితాలు ఎంత ఇవ్వాలి ఎవరికీ ఇవ్వాలి అని జాతీయ స్థాయిలో నిపుణల కమిట వేసి అదే ఎవరు గెలిచినా ఇవ్వాలి అన్ని పార్టీలు ఆ నిబంధన పాటించే విధంగా చట్టాన్ని మార్చుకోకపోతే దేశనాశనం జరుగుతుంది ఆ ఇచ్చే సొమ్ము కూడా భారత్ ప్రభుత్వ సింబల్ తోనే ఇవ్వాలి కానీ ఎవరి పేర్లు పెట్టి ఇవ్వకూడదు దాన్ని ప్రచారానికి వాడుకోనివ్వకూడదు అప్పుడే మంచి ప్రభుత్వాలు వస్తాయి రేపు చైనా వాడు ఎవరికో సపోర్ట్ చేసి అందరికన్నా ఎక్కువ ఇస్తానంటే వాడికే వేసే లాగా వున్నారు

Comments are closed.