సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖుల వరకు అందరికీ వాస్తుపై నమ్మకం ఉంటుంది. కోరుకున్నది ఏది జరగకపోయినా, ఏదైనా చెడు జరిగినా వాస్తు దోషం కారణంగానే అలా అయిందని అనుకుంటారు.
వెంటనే తాము నివసిస్తున్న ఇంటిలో వాస్తు మార్పులు చేయిస్తుంటారు. కేసీఆర్ కు వాస్తు పిచ్చి ఎక్కువనే సంగతి తెలిసిందే. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోదరుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా వాస్తు నమ్మకం ఎక్కువగా ఉంది. కారణం …ఆయనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి రాలేదు. మంత్రి పదవి రాకపోవడానికి రాజకీయంగా అనేక కారణాలు ఉంటాయి.
ఆల్రెడీ ఆయన అన్నయ్య కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిలో ఉన్నాడు. పైగా ఇద్దరిదీ నల్గొండ జిల్లానే. ఒకే కుటుంబంలో ఇద్దరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదు. అలా ఇస్తే విమర్శలు వస్తాయి. కానీ మంత్రి పదవి రాకపోవడానికి కారణం తన క్యాంప్ కార్యాలయం వాస్తు బాగాలేదని నమ్మిన రాజగోపాల్ రెడ్డి దాన్ని కొద్దిగా కూలగొట్టి మళ్ళీ కడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందువరకు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గెలిచారు. అప్పుడే తనకు మంత్రి పదవి ఇవ్వాలని, అది కూడా హోమ్ శాఖ ఇవ్వాలని అడిగారు. కానీ అధిష్టానం ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వలేదు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని చాలాసార్లు ఆయన బహిరంగంగానే డిమాండ్ చేశారు.
కానీ వర్కవుట్ కాలేదు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. దాంట్లో మంత్రి పదవి వస్తుందేమోనని ఆశపడుతున్నారు. ఏది ఏమైనా తనకు పదవి రాకపోవడానికి వాస్తు కారణమని రాజగోపాల్ రెడ్డి నమ్ముతున్నటుగా అనిపిస్తోంది.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు