రైతుల పాలిట శాపంగా మారిన ఫ్రీహోల్డ్‌

నెల‌ల త‌ర‌బ‌డి రిజిస్ట్రేష‌న్లు కాకుండా చేయ‌డంపై రైతులు కూట‌మి ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత కొన్ని భూముల్ని ఫ్రీహోల్డ్ జాబితాలో వేసింది. నిజంగా అనుమానం ఉన్న భూముల‌పై విచారించి, అక్ర‌మాల‌పై చ‌ర్య‌లు తీసుకుంటే ఎవ‌రికీ అభ్యంత‌రం వుండ‌దు. అక్ర‌మార్కుల ఆట‌ల్ని క‌ట్టించిన‌ట్టు అయ్యేది. కానీ అలాంటి ప‌నులేవీ చేయ‌కుండా. నెల‌ల త‌ర‌బ‌డి రిజిస్ట్రేష‌న్లు కాకుండా చేయ‌డంపై రైతులు కూట‌మి ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌భుత్వం అసైన్డ్ భూముల్ని ఫ్రీహోల్డ్‌లో పెట్టామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ, క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వం మ‌రోలా వుంది. ఇనామ్‌, ఇత‌ర ర‌కాల భూముల్ని కూడా ఫ్రీహోల్డ్‌లో పెట్టి, రిజిస్ట్రేష‌న్లు కాకుండా అడ్డుకుంది. గ‌త ఏడాది ఆగ‌స్టు నుంచి అలాంటి భూముల రిజిస్ట్రేష‌న్లు ఆగిపోయాయి. ఇప్పుడు మ‌రో రెండు నెల‌ల పాటు కొన‌సాగిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇవ్వ‌డంపై రైతులు మండిప‌డుతున్నారు.

గ‌త ఆగ‌స్టు నుంచి రిజిస్ట్రేష‌న్లు నిలుపుద‌ల చేసి ఏం సాధించార‌ని రైతులు ప్ర‌శ్నిస్తున్నారు. వంశ‌పారంప‌ర్యంగా వ‌స్తున్న ప‌ట్టా భూముల్ని కూడా ర‌క‌ర‌కాల సాకుతో రిజిస్ట్రేష‌న్లు ఎందుకు నిలిపార‌ని నిల‌దీస్తున్నారు. ప్ర‌స్తుతం అన్ని ర‌కాల భూముల‌కు సంబంధించి రైతుల నుంచి ప‌త్రాల్ని స‌చివాల‌య సిబ్బంది అడుగుతున్నారు.

దీంతో రైతుల్లో ఆందోళ‌న మొద‌లైంది. ఎప్ప‌టి నుంచో ఉన్న భూముల‌కు సంబంధించి ప‌త్రాలు ఎందుకు అడుగుతున్నారు? ఏమైనా చేస్తారేమో అని రైతుల్లో అనుమానం, భ‌యం ఏర్ప‌డింది. కావున ప్ర‌భుత్వం ఫ్రీహోల్డ్ విష‌య‌మై రైతుల్లో ఆందోళ‌న‌ల్ని, భ‌యాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

3 Replies to “రైతుల పాలిట శాపంగా మారిన ఫ్రీహోల్డ్‌”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.