సిండికేట్ కోసం సత్యను వాడుకున్నాడా?

ప్రస్తుతానికైతే వర్మకు మద్దతుగా, వ్యతిరేకంగా వస్తున్న పోస్టులతో సోషల్ మీడియా నిండిపోతోంది.

2 రోజుల కిందట ఉన్నఫలంగా రామ్ గోపాల్ వర్మ నుంచి ఊహించని మాటలొచ్చాయి. దాదాపు 2 దశాబ్దాల తర్వాత తనకు జ్ఞానోదయం అయిందని, ఇకపై ఆర్జీవీ అంటే ఏంటో చూపిస్తానని అన్నాడు. 27 ఏళ్ల తర్వాత తను తీసిన సత్య సినిమాను మరోసారి చూశానని, కన్నీళ్లు వచ్చాయని, అలాంటి సినిమాను తను ఎందుకు బెంచ్ మార్క్ గా పెట్టుకోలేకపోయానని అన్నాడు.

ఇలా చెప్పుకుంటూపోతే తనకు బుద్ధొచ్చిందని, జ్ఞానోదయం కలిగిందని, ఇకపై తన ప్రతిభకు తగ్గట్టు, తన గౌరవాన్ని పెంచేలా గొప్ప సినిమాలు తీస్తానంటూ చాలా రాసుకొచ్చాడు.

అతడి పోస్టు చూసి చాలామంది అది నిజమని నమ్మారు. మరికొందరు మాత్రం వర్మ మాటలకు అర్థాలే వేరులే అనుకున్నారు, ఇంకేదో ఉందంటూ కామెంట్ చేశారు. మరోసారి జనాల్ని తనవైపు తిప్పుకునేందుకు వర్మ వేసిన ఎత్తుగడగా చెప్పుకొచ్చారు.

ఓవైపు ఇలా కామెంట్స్ పడుతుండగానే కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు ఆర్జీవీ. సత్య, రంగీలా లాంటి సినిమాల తర్వాత తన కళ్లు నెత్తికెక్కాయని అంగీకరించిన వర్మ.. ఆ అంతర్మథనం నుంచి బిగ్గెస్ట్ సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. దానికి ‘సిండికేట్’ అనే పేరు కూడా పెట్టాడు. అంతేకాదు, సినిమా కాన్సెప్ట్ కూడా చెప్పుకొచ్చాడు.

సిండికేట్ సినిమా ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటనే విషయాల్ని పక్కనపెడితే, ఈ సినిమా ప్రకటన కోసమే.. 2 రోజుల కిందట కన్ఫెషన్ పేరిట పెద్ద డ్రామా ట్వీట్ ఒకటి వేశాడంటూ వర్మపై ట్రోలింగ్ మొదలైంది.

తన సినిమాల వైపు ప్రజల్ని ఎలా తిప్పుకోవాలో రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని, ఆ జిమ్మిక్కుల్లో భాగంగానే, తన కొత్త సినిమా ‘సిండికేట్’ కోసం వర్మ ఇలా కొత్త డ్రామా మొదలుపెట్టాడని, అతడు జీవితంలో మారడని అంటున్నారు మరికొంతమంది.

ప్రస్తుతానికైతే వర్మకు మద్దతుగా, వ్యతిరేకంగా వస్తున్న పోస్టులతో సోషల్ మీడియా నిండిపోతోంది. త్వరలోనే తన సిండికేట్ సినిమా నటీనటులు, టెక్నీషియన్స్ ను వెల్లడిస్తానంటున్నాడు ఈ దర్శకుడు.

12 Replies to “సిండికేట్ కోసం సత్యను వాడుకున్నాడా?”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. మేము ముందు నుండీ చెపుతూనే ఉన్నాము.. ఈ జగన్ రెడ్డి, జగన్ రెడ్డి మనుషులు నువ్వు, ఆర్జీవీ లాంటి వాళ్ళు.. సందర్భాన్ని స్వలాభానికి వాడుకొంటారు..

    ..

    జగన్ రెడ్డి కూడా.. అధికారం లోకి వచ్చేది మనమే.. మీరు కష్టపడండి .. పేర్లు రాసుకోండి.. నేను వస్తాను.. చూసుకొంటాను .. అంటాడు.. గొర్రెలు నమ్మేస్తాయి.. జగన్ రెడ్డి అధికారం కోసం ఈ గొర్రెలు ఇల్లు, ఒళ్ళు అమ్ముకొంటారు.. వీధిన పడతారు.. బతుకులు నాశనం చేసుకొంటారు..

    ..

    ఇప్పుడు ఆర్జీవీ కూడా అంతే.. నేను మారిపోయాను అంటాడు.. గొర్రెల్లాంటి నిర్మాతలు వస్తారు.. మళ్ళీ ఐస్ క్రీమ్, వ్యూహం, కడప బిడ్డలు, లక్ష్మి’స్ అంటూ పరమ చెత్తంతా జనాల మీద కు వదులుతాడు..

    ..

    ఈ జగన్ రెడ్డి.. వాడి జనాలు మారుతాము అని చెపుతున్నారంటే.. తోడేళ్ళ అవతారం ఎత్తినట్టే..

    జాగ్రత్తగా ఉండండి..

      1. జగన్ అనే పదం బూతుపదమేమీ కాదు కదా..

        నిజాలు మాట్లాడితే..ఉలుకెందుకు..

        అబద్ధాలు మాట్లాడితే.. ప్రశ్నించండి.. సమాధానం చెపుతాను..

    1. RGV ni kone vaadu puttaledhu Inka… Ammudu povadaniki ready ga unte eppudo vadesavdu vadatam Baga telisna vallu jagan kante mundhe puttaru… Motham TDP party ni tanaki anukulanga vadukunna uddhandudu Inka rajakeyallone unnadu…Ramojini ABN ni vaadi vaadi ippudu valla chestha vadiko baduthunnavadu…RGV ni vaduluthada…..Impossible.

      1. ఏంటో.. ఈ విషయం ఆర్జీవీ కి అయినా తెలుసో లేదో..

        ఈ కామెంట్స్ వాడికి పంపించండి.. వాడే గట్టిగా ఖండిస్తాడు..

  4. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.