ఓటీటీ యుగంలో కూడా సినిమా స్టార్లు రీమేక్ లను ఎంచుకుంటూ ఉండటం చాలా ఆశ్చర్యకరమైన అంశం! తెలుగులో ఇలాంటి ధోరణి పెద్ద పెద్ద హీరోలే కొనసాగిస్తూ ఉన్నారు. రీమేక్ సినిమాలు అనేవి ఇప్పుడు ఎవ్వరికీ పట్టనివిగా మారిపోతూ ఉన్నాయి. హిట్ అయిన సినిమా కథలను రీమేక్ చేయడానికి హీరోలు తమ సమయం వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నా, ప్రేక్షకులు అయితే అలాంటి వాటిని చూడటానికి సమయం వెచ్చించడం లేదు! కట్ చేస్తే.. ఇప్పుడు మలయాళీ సినిమా మార్కో రీమేక్ అనే వార్త కనిపిస్తూ ఉంది.
ఇటీవలే థియేటరికల్ రిలీజ్ పొందిన ఆ సినిమా మలయాళీ మీడియా నుంచి పాజిటివ్ రివ్యూలు పొందింది. విపరీతమైన హింసాత్మక సినిమా అనే టాక్ నడుస్తూ ఉంది. ఆ మధ్య వచ్చిన హిందీ సినిమా ‘కిల్’ అత్యంత బీభత్స, భయానక హింసాత్మక సినిమాగా నిలిచింది. నడుస్తున్న రైల్లో సాగే ఆ సినిమా అత్యంత కృతకమైన ఫైట్ సీన్లతో వచ్చినా వీక్షకుల ఆదరణ పొందింది. అంత తీవ్రమైన హత్యకాండను సాగించేందుకు తగ్గ పాయింట్ ఉండటంతో ఆ హింస చెల్లింది. మార్కో మరింత బీభత్సం అని అంటున్నారు వీక్షించిన వాళ్లు.
ఆ సంగతలా ఉంటే.. రేపోమాపో ఈ సినిమా ఓటీటీలో వస్తే మలయాళీ సినిమాల ఊపు మీద మంచి వ్యూస్ ను పొందుతుంది. జనతాగ్యారేజ్ లో నటించిన ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమాను తమిళంలో విక్రమ్ రీమేక్ చేయనున్నాడనే టాక్ నడుస్తూ ఉందిప్పుడు!
ఈ మధ్య ‘తంగాలన్’ తో మంచి విజయాన్ని అందుకున్నాడు విక్రమ్. ఓటీటీలో కూడా అది వీక్షకాదరణ పొందుతూ ఉంది. మళ్లీ ఇంతలోనే రీమేక్ సినిమా అంటే, ఈ రోజుల్లో రీమేకా, అది కూడా విక్రమ్ నా అనుకోవాల్సి వస్తుంది. ఇది వరకూ కూడా విక్రమ్ ఒక మలయాళీ సినిమా రీమేక్ తో భంగపడ్డాడు. అపరిచితుడు సినిమా వంటి ఊపులో మజా అనే ఒక సినిమాను చేశాడితను. అది ఒక మలయాళీ సినిమాకు రీమేక్. అది తెలుగుతో పాటు, తమిళంలో కూడా ఆకట్టుకోలేదు. మరి ప్రయోగాలు చేసే ఉత్సాహం ఉన్న నటులు ఓటీటీ యుగంలో రీమేక్ ల జోలికెళ్లడం ఎందుకో!
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఆరు, నాలుగు, తొమ్మిది, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
tangalan dengalaan andhi, adhi hit aa?
commonman commodeman la unnadu