డైమండ్ క్వీన్ కు డైమండ్ రింగ్!

తనకు బాగా సన్నిహితులైన వారికి ఆ డైమండ్ రింగ్ ఉదంతం షేర్ చేసుకుని మురిసిపోయింది.

అమ్మాయే సన్నగా, అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్లు మంచాన పడిపోరా? అలాంటిది డైమండ్ క్వీన్ లాంటి అమ్మాయి, ఎంత వరకు కవ్వించాలో అంత వరకు కవ్విస్తూ నటిస్తే, ఆడిపాడితే, ఎలాంటి హీరో అయినా ఫిదా అవ్వాల్సిందే కదా. అందుకే ఓ హీరో అలా ఫిదా అయ్యారు.

తనతో మంచి పాటకు డ్యాన్స్ చేసిన అమ్మాయి. పైగా ఆ డ్యాన్స్ బాగా వైరల్ అయ్యింది. అందుకే మంచి కానుక ఇవ్వాలని అనుకున్నారని తెలుస్తోంది. అమ్మాయిలకు డైమండ్స్ కన్నా గొప్ప కానుకలు ఏముంటాయి?

అందుకే ఆ హీరో, డైమండ్ క్వీన్ మాదిరిగా తన సరసన అద్భుతమైన డ్యాన్స్ చేసి, పాట వైరల్ కావడానికి సహకరించిన హీరోయిన్‌కు డైమండ్ రింగ్ బహుమతిగా అందించినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారం బయటకు ఎలా వచ్చింది అనే అనుమానం రానే వస్తుంది. ఇక్కడ ఏమైంది అంటే, ఈ నటి ఏదీ తనలో తాను దాచుకోవడం తెలీదు. టక్కున అది సోషల్ మీడియాలో పెట్టేయాలి. లేదంటే సన్నిహితులతో షేర్ చేసుకోవాలి. అలా తనకు బాగా సన్నిహితులైన వారికి ఆ డైమండ్ రింగ్ ఉదంతం షేర్ చేసుకుని మురిసిపోయింది.

దాంతో అది బయటకు వచ్చి గ్యాసిప్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ముందు ముందు మరిన్ని డ్యాన్స్ సాంగ్స్ ఈ ఇద్దరూ కలిసి మరోసారి చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ హీరోకి నచ్చితే ఎవరు ఏమన్నా, ఎలాంటి ఈక్వేషన్లు పట్టించుకోరు. అదీ సంగతి.

10 Replies to “డైమండ్ క్వీన్ కు డైమండ్ రింగ్!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.