రాజాసాబ్.. ఇంకా ఎంత ఉంది?

దసరా బరిలోకి దిగే అవకాశం ఉందని అనుకోవాల్సిందే. ఈ ఏడాదికి ప్రభాస్ సినిమా ఇది ఒక్కటే.

సమ్మర్ బరిలోంచి తప్పుకుంది ప్రభాస్ రాజాసాబ్. ఎప్పుడు కొత్త డేట్ అనేది తెలియదు. మార్కెటింగ్ పనులు ఉండనే ఉన్నాయి. అదికాక, సినిమా వర్క్, సీజీ పనులు కూడా ఉండనే ఉన్నాయి.

ప్రస్తుతం హీరో లేని సీన్లు షూట్ చేస్తున్నారు. సినిమాకు బ్యాలెన్స్ వర్క్ కనీసం ఇరవై రోజులు ఉందని తెలుస్తోంది. ఈ ఇరవై రోజుల్లో పది రోజులు హీరో లేనివి, పది రోజులు హీరో ఉన్నవి. కాస్త ప్యాచ్ వర్క్ ఉంటుంది.

ఇదికాక పాటలు చిత్రీకరించాలి. అంటే ఇదిగో అదిగో అని రెండు నెలల పని ఉన్నట్లే. ఆపైన పోస్ట్ ప్రొడక్షన్, సీజీ పనులు ఉండనే ఉంటాయి. అందువల్ల దసరా బరిలోకి దిగే అవకాశం ఉందని అనుకోవాల్సిందే. ఈ ఏడాదికి ప్రభాస్ సినిమా ఇది ఒక్కటే. హను రాఘవపూడి ఫౌజీ సినిమా షూట్ ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది. అది రిలీజ్‌కు కనీసం ఏడాది పడుతుంది. బాగా స్పాన్ ఉన్న కథ అది, డిఫరెంట్ లొకేషన్లలో చిత్రీకరించాల్సి ఉంది.

రాజాసాబ్ కు దాదాపు 200 వర్కింగ్ డేస్ అవసరం పడ్డట్టు తెలుస్తోంది. ఇందులో హీరో పని చేసిన రోజులు, హీరో లేకుండా షూట్ చేసిన రోజులు సరిసమానంగా ఉన్నట్లు బోగట్టా. దర్శకుడు మారుతి ఎక్కువ రోజులు తీసిన సినిమా ఇదే.

3 Replies to “రాజాసాబ్.. ఇంకా ఎంత ఉంది?”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.