టాలీవుడ్ లో ఇంత పెద్ద ఎత్తున ఆదాయపన్ను సోదాలు జరగడం అన్నది కాస్త షాకింగ్ గా వుంది. వాస్తవానికి జీఎస్టీ వచ్చిన తరువాత, టీడీఎస్ అమలు జరుగుతున్న తరువాత సోదాలు అన్నది కామన్ అయిపోయింది. జీఎస్టీ అధికారులు రావడం అక్కౌంట్స్ చూడడం, టీడీఎస్ అధికారులు రావడం చూడడం అన్నది ఇటీవల కామన్ అయిపోయింది. ఆదాయ పన్ను దాడులు తగ్గిపోయాయి. ఏడాది కిందట సితార, హారిక హాసిని మీద జరిగాయి. తరువాత అంతగా జరిగినట్లు వార్తలు రాలేదు.
ఇప్పుడు ఒక్కసారిగా రెండు మూడు పెద్ద సంస్థల మీద, మరో రెండు మూడు మీడియం సంస్థల మీద ఐటి దాడులు ఒకేసారి జరగడం, పదుల సంఖ్యలో టీమ్ లు రావడం, ఇదంతా చాలా ఆశ్చర్యంగా వుంది. మైత్రీ మూవీస్ అంటే చిన్న చితక సంస్థ కాదు. ఆ సంస్థ వెనుక చాలా అంటే చాలా మంది ఎన్నారైల పెట్టుబడులు, రాజకీయ నాయకుల పెట్టుబడులు వున్నాయనే వార్తలు వినిపిస్తుంటాయి. అలాగే మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో రాజకీయ నాయకులైన వ్యాపారుల పెట్టుబడులు వున్నాయి. ఇంకా చాలా సంస్థలతో ఆర్థిక లావాదేవీలు వున్నాయి.
ఇవన్నీ ఏమీ ఇల్లీగల్ లావాదేవులు కావు. అన్నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ లే కావచ్చు. కానీ అసలు ఆదాయపన్ను శాఖ దృష్టికి ఇవన్నీ వెళ్లినట్లు అవుతుంది. అభిషేక్ అగర్వాల్ సంస్థ మీద కూడా దాడులు జరిగాయి. నిజానికి ఆ సంస్థ ఏమంత అద్భుతమైన లాభాలు ఆర్జించలేదు. టైగర్ నాగేశ్వరరావుతో నష్టపోయింది. కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీసింది. తరువాత మరో హిందీ సినిమా చేస్తోంది. అంతే.
అయితే ఆ సంస్థకు మైత్రీతో కొన్ని లావాదేవీలు వున్నాయి. అందుకే దాని మీదకు వచ్చారని అనుకుంటున్నారు. గమ్మత్తేమిటంటే ఈ సంస్థకు పీపుల్స్ మీడియాతో కూడా అపరమిత లావాదేవీలు వున్నాయని టాక్. మరి ఐటి అధికారులు క్రాస్ వెరిఫికేషన్ చేస్తే అటు కూడా వెళ్తారేమో అనే అనుమానాలు వుండనే వున్నాయి.
నిర్మాత దిల్ రాజు సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో వుంది నిజానికి. కానీ ఎందుకు ఇప్పుడు ఐటి సోదాలు మీద పడ్డాయి అన్నది అనుమానం. ఇటీవల దిల్ రాజు కూడా విదేశాల్లోని మన వారి నుంచి ఫండ్స్ సేకరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
మైత్రీ సంస్థకు విదేశీ నిధుల లింక్ వుంది. అనిల్ సుంకర, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ కు అదే లింక్ వుంది. దిల్ రాజు ఇటీవల విదేశీ పెట్టుబడుల కోసం ప్రయత్నించారు. మ్యాంగో రామ్ సంస్థ ఏకంగా విదేశాల్లోనే రిజిస్టర్ అయింది. ఒక్క అభిషేక్ అగర్వాల్ లింక్ తప్పిస్తే మిగిలినవి అన్నీ విదేశీ నిధుల లింక్ వున్న కంపెనీలే.
అందువల్ల ఈ దాడులను ఆ దిశగా చూస్తున్నారు. దాడులు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసారు. సుకుమార్ ఎప్పుడు దుబాయి నుంచి వస్తారు అన్నది పెర్ ఫెక్ట్ గా కనుక్కుని మరీ రంగంలోకి దిగారు. మ్యాంగో రామ్ ముంబాయిలో వున్న సంగతి తెలుసుకుని రంగంలోకి దిగారు.
ఫైనాన్సియర్, ఎన్టీఆర్ అభిమాని ప్రతాపరెడ్డి ఇంటి మీద కూడా ఐటి సోదాలు జరుగుతున్నాయి. ఇది అసలు ఎవరికీ పెద్దగా పరిచయం లేని లింక్. అది కూడా ఐటి అధికారులకు తెలిసింది.
మొత్తం వ్యవహారం మరో రెండు రోజుల పాటు జరుగుతుంది. ఇంకా ఎన్ని పేర్లు బయటకు వస్తాయో చూడాలి.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
IT should raid all the production houses regularly
Bjp needs money