ఈ నెల 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై చంద్రబాబు సర్కార్ జ్యుడిషియల్ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి సత్యనారాయణమూర్తి ఈ కమిషన్‌కు నాయకత్వం వహిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు పోగొట్టుకోవడంతో పాటు పదుల సంఖ్యలో గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనకు బాధ్యుల్ని చేస్తూ కొందరిపై బదిలీ వేటు, మరి కొందరు అధికారుల్ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం టీటీడీ అందజేసింది. అలాగే టీటీడీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది.
ఇదిలా వుండగా తొక్కిసలాట దుర్ఘటనపై ఆరునెలల్లో విచారించి నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విచారణ కమిషన్‌కు నాయకత్వం వహించే సత్యనారాయణమూర్తి గతంలో హైకోర్టులో జడ్జిగా పని చేశారు.
నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిషన్‌కు సర్వాధికారాల్ని ప్రభుత్వం ఇచ్చింది. టీటీడీలో ఎప్పుడూ లేని విధంగా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడాన్ని చంద్రబాబు సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. మళ్లీ అలాంటివి పునరావృతం కాకుండా వుండేందుకు విచారణ కమిషన్ ఎలాంటి సిఫార్సులు చేస్తుందో చూడాలి.
manchidi .. nijalu bayatiki ravali .
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు