అనీల్ రావిపూడిపై ఐటీ దాడులు?

చాలామంది దర్శకులతో పోలిస్తే నా పారితోషికం తక్కువ అంటారు. అలాంటివేం నాకు తెలియవు. నా సినిమా బడ్జెట్ బట్టే నాకు రెమ్యూనరేషన్ ఇస్తారు.

పుష్ప-2 తీసిన సుకుమార్ నివాసం, ఆఫీసులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి పెద్ద సక్సెస్ ఇచ్చిన అనీల్ రావిపూడి నివాసంపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్టు కథనాలొస్తున్నాయి.

మరీ ముఖ్యంగా దిల్ రాజు నిర్మించిన సినిమా కాబట్టి, ఆటోమేటిగ్గా అనీల్ రావిపూడిపై కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఓ కన్నేసి ఉంటారని అంతా అనుకున్నారు.

కానీ తనపై ఎలాంటి ఐటీ రైడ్స్ జరగలేదని అనీల్ రావిపూడి స్పష్టం చేశాడు. “నా మీద ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగలేదు. నాపై వస్తున్నది రాంగ్ న్యూస్. నేను ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నాను. నా దగ్గర కూడా డబ్బులున్నాయి కానీ అవన్నీ క్లియర్ గా ఉన్నాయి. జీఎస్టీలు ఎప్పటికప్పుడు కడుతున్నాను. నాకొచ్చిన ప్రసాదాన్ని నేను జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నాను. ఐటీ దాడులు జరిగేంత శ్రీమంతుడ్ని ఇంకా అవ్వలేదు.”

ఇలా తనపై వస్తున్న పుకార్లపై స్పష్టత ఇచ్చాడు రావిపూడి. ఓవైపు వరుసగా హిట్స్ ఇస్తున్నప్పటికీ ఇతర పెద్ద దర్శకులతో పోలిస్తే, తనకు ఎందుకు పారితోషికం పెరగలేదనే అంశంపై కూడా స్పందించాడు.

“చాలామంది దర్శకులతో పోలిస్తే నా పారితోషికం తక్కువ అంటారు. అలాంటివేం నాకు తెలియవు. నా సినిమా బడ్జెట్ బట్టే నాకు రెమ్యూనరేషన్ ఇస్తారు. భవిష్యత్తులో పెంచుతారేమో నాకు తెలియదు.”

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్ అయి టాలీవుడ్ కు చిన్నపాటి షాక్ ఇచ్చిందనే కామెంట్ ను పరోక్షంగా అంగీకరించాడు రావిపూడి. తన సినిమా వసూళ్ల పోస్టర్లను కచ్చితంగా తను చెక్ చేస్తానని, మహా అయితే జీఎస్టీ కలిపి వసూళ్లు వెల్లడిస్తాం తప్ప, అంతకుమించి అంకెలు మార్చమని అంటున్నాడు.

3 Replies to “అనీల్ రావిపూడిపై ఐటీ దాడులు?”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.