అన్నయ్య, వదిన.. ఓ తమ్ముడు.!

బాలీవుడ్‌ భామ అనుష్క శర్మని ఉద్దేశించి ‘నువ్వు సూపర్‌ వదినా..’ అంటూ ట్వీట్‌ చేశాడు క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌. మామూలుగా అయితే అనుష్క శర్మకి ఒళ్ళు మండిపోవాలి. ఎందుకంటే, తనకంటే పెద్దవాడైన యువరాజ్‌సింగ్‌, తనను వదిన…

బాలీవుడ్‌ భామ అనుష్క శర్మని ఉద్దేశించి ‘నువ్వు సూపర్‌ వదినా..’ అంటూ ట్వీట్‌ చేశాడు క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌. మామూలుగా అయితే అనుష్క శర్మకి ఒళ్ళు మండిపోవాలి. ఎందుకంటే, తనకంటే పెద్దవాడైన యువరాజ్‌సింగ్‌, తనను వదిన అనడమేంటి.? అని. కానీ, ఇక్కడ అనుష్క శర్మ ముసి ముసి నవులు నవ్వుకుందట.

అసలు విషయమేంటంటే, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీతో డేటింగ్‌ చేస్తోంది అనుష్క శర్మ. యువరాజ్‌సింగ్‌ కన్నా క్రికెట్‌లో చాలా వెనకే వచ్చిన కోహ్లీ, ఇప్పుడు టీమిండియాలో కీలక సభ్యుడిగా మారాడు. యువరాజ్‌సింగ్‌ మాత్రం జట్టుకి దూరమయ్యాడు. అయితేనేం యువీ, కోహ్లీ మధ్య స్నేహం అలానే వుంది. ఆ స్నేహంతోనే సరదాగా కోహ్లీని అన్నయ్యా అనీ, అన్నయ్యకు కాబోయే బార్య అనుష్కని వదిన అనీ సంబోదించాడు.

ఇక, పై ఫొటో విషయానికొస్తే ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌, బెంగళూరు జట్ల మధ్య నిన్న జరిగిన (మ్యాచ్‌ ఒక సెషన్‌ ముగిసేసరికి వర్షం పడటంతో రెండో సెషన్‌ రద్దయ్యింది) మ్యాచ్‌ సందర్భంగా అనుష్క నడుము మీద చెయ్యేసిమరీ తనవైపుకు లాక్కున్నాడు కోహ్లీ. ఆ ముచ్చటైన సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు యువరాజ్‌సింగ్‌. అన్నయ్య, వదిన.. ఓ తమ్ముడు.. ఫొటో క్యాప్షన్‌ అదిరింది కదూ.!