స‌చిన్ పార్టీ ఇస్తున్నాడు!

టెంప‌ర్ రీమేక్ రైట్స్ ద‌క్కించుకొన్న స‌చిన్ జోషీ ఆనందానికి అవ‌ధుల్లేవ్‌. ఈసినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేసి హిట్టుకొడ‌తా.. అంటున్నాడు స‌చిన్‌. ప్రస్తుతం హీరో కోసం అన్వేషిస్తున్నాడు. టెంప‌ర్ త‌న చేతికి ద‌క్కిన హ్యాపీ మూడ్‌లో…

టెంప‌ర్ రీమేక్ రైట్స్ ద‌క్కించుకొన్న స‌చిన్ జోషీ ఆనందానికి అవ‌ధుల్లేవ్‌. ఈసినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేసి హిట్టుకొడ‌తా.. అంటున్నాడు స‌చిన్‌. ప్రస్తుతం హీరో కోసం అన్వేషిస్తున్నాడు. టెంప‌ర్ త‌న చేతికి ద‌క్కిన హ్యాపీ మూడ్‌లో ఉన్న స‌చిన్‌.. ఇప్పుడు టెంప‌ర్ టీమ్‌కీ, మీడియాకి గ్రాండ్ పార్టీ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యాడు. 

శ‌నివారం రాత్రి పార్క్ హ‌య‌త్‌లో టెంప‌ర్ టీమ్‌కి త‌న రేంజు పార్టీ ఇస్తున్నాడు స‌చిన్‌. ఇందులో పాల్గొనాలంటూ కొంత‌మంది మీడియా పెద్దల‌కూ ఆహ్వానాలు పంపాడు. టెంప‌ర్ సినిమాకి ఎప్పుడు, ఎవ‌రితో రీమేక్ చేస్తాడో, అస‌లు ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కుతుందో తెలీదుగానీ.. అప్పుడే హిట్ కొట్టినంత సంబ‌ర ప‌డుతున్నాడు స‌చిన్‌. 

ఇంత‌కీ టెంప‌ర్ లాభ‌న‌ష్టాల గురించి స‌చిన్‌కి పూర్తిగా తెలుసో.. లేదో..??