అనుష్క కోసం నాగ్‌… నాగ్ కోసం అనుష్క…

నాగార్జున త‌న‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశాడ‌ని అనుష్కకు ఎప్పుడూ గుర్తుంటుంది. అందుక‌నే నాగ్ విష‌యం త‌న ద‌గ్గర ఎప్పుడు ఎవ‌రు ప్రస్తావ‌న‌కి తెచ్చినా మాట‌ల్లో ఆ కృత‌జ్ఞత‌ను చూపిస్తూనే ఉంటుంది. నాగార్జున కూడా…

నాగార్జున త‌న‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశాడ‌ని అనుష్కకు ఎప్పుడూ గుర్తుంటుంది. అందుక‌నే నాగ్ విష‌యం త‌న ద‌గ్గర ఎప్పుడు ఎవ‌రు ప్రస్తావ‌న‌కి తెచ్చినా మాట‌ల్లో ఆ కృత‌జ్ఞత‌ను చూపిస్తూనే ఉంటుంది. నాగార్జున కూడా అనుష్క ప‌ట్ల చాలా అభిమానంగా ఉంటాడు. ఒక‌సారి ఓ ఆడియో ఫంక్షన్‌లో  మీ ప‌క్కన బావుండే హీరోయిన్ ఎవ‌రని మీరు అనుకుంటారంటే మొహ‌మాటం లేకుండా అనుష్క అని చెప్పేశాడు నాగ్‌. 

అదే అభిమానంతో.. అనుష్క ప్రధాన పాత్రధారిణిగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం సైజ్ జీరోలో నాగార్జున అతిధి పాత్రకు ఒప్పుకున్నాడు. ఇదే పాత్రను త‌మిళ్‌లో కార్తి చేస్తున్నాడు. ఒక పెద్ద హీరో మ‌రొక చిత్రంలో అతిధి పాత్రకు ఒప్పుకోవ‌డ‌మే విశేషం అది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో అంటే మ‌రీ చెప్పుకోవాల్సిన విశేష‌మే. 

అయితే త‌న‌కి ఇంత మంచి సాయం చేసిన‌ నాగ్ రుణం తీర్చుకునే అవ‌కాశం కూడా అనుష్కకి వెంట‌నే వ‌చ్చింది. నాగ్‌, కార్తి హీరోలుగా రూపొందుతున్న చిత్రంలోని అతిధి పాత్రకు అనుష్క ఒప్పుకుంది. ఫ్రెంచి చిత్రం అన్‌ట‌చ్ బుల్స్‌కి రీమేక్‌గా త‌యార‌వుతున్న ఈ సినిమాలో నాగార్జున వీల్‌ఛైర్ కు ప‌రిమిత‌మ‌య్యే పాత్ర ధ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో నాగ్‌కు మాజీ గాళ్ ఫ్రెండ్ పాత్రను అనుష్క పోషిస్తోంది. త్వర‌లో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌డానికి పారిస్ వెళ్లనుంద‌ట అనుష్క.