నో బాహుబలి -2

మొత్తానికి రాజమౌళి ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ సినిమాగా తయారవుతున్న బాహుబలి ని రెండు భాగాలుగా విడుదల చేయాలా? ఒక్క భాగంగానే విడుదల చేయాలా అన్నది ఆయన డైలామా.…

మొత్తానికి రాజమౌళి ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ సినిమాగా తయారవుతున్న బాహుబలి ని రెండు భాగాలుగా విడుదల చేయాలా? ఒక్క భాగంగానే విడుదల చేయాలా అన్నది ఆయన డైలామా. ఇప్పుడు ఆ విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. 

ఈ మేరకు బాహుబలి మొత్తం ఒక భాగంగానే విడుదలవుతుంది. రెండు భాగాలుగా విడుదల చేయడం అన్నది కాస్త రిస్క్ అని తొలిభాగంలో ఉత్కంఠతో ఆపితే తప్ప రెండో భాగంపై ఆసక్తి వుండదు. అలా అని అర్థాంతరంగా ఆపితే, తొలిభాగంపై అసంతృప్తి వస్తుంది. ఈ సమస్యలన్నింటికీ బదులు ఒక భాగంగానే విడుదల చేయాలన్న నిర్ణయానికి జక్కన్న వచ్చారని టాక్ వినిపిస్తోంది.