ఒక మంచి విజయం దక్కగానే హీరో లేదా హీరోయిన్ కెరీర్ సెటిల్ అయిపోయినట్టే అనుకుంటారు. అయితే ఒక్కోసారి మాత్రం ఎంతటి విజయం దక్కినా కానీ సదరు హీరో లేదా హీరోయిన్ మళ్లీ తమ నెక్స్‌ట్ సినిమాతోను తమ సత్తా చాటుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. యువ హీరో సందీప్ కిషన్ సిట్యువేషన్ అలాగే ఉందిపుడు.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో హిట్ అయితే కొట్టాడు కానీ ఈ కుర్రోడికి ఇంకా హీరోగా గుర్తింపు రాలేదు. ఆ విజయం అతనికి అవకాశాలు తెచ్చి పెడుతోంది కానీ హీరోగా ఎలాంటి ఐడెంటిటీ తీసుకురాలేదు. అందుకే అతని సినిమా ‘డి.కె. బోస్’ ఇంకా విడుదల కాకుండా అలాగే ఉండిపోయింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ విజయంతో అతని సినిమాలకి డిమాండ్ ఉంటుందని అనుకుంటే అది జరగలేదు.
ఈ నేపథ్యంలో అతను నటించిన ‘రారా కృష్ణయ్య’ ఈవారం రిలీజ్ అవుతోంది. జగపతిబాబు ముఖ్య పాత్ర చేసిన ఈ చిత్రంతో సందీప్ బ్యాంకబుల్ హీరోగా పేరు తెచ్చుకుంటాడని, అతని తదుపరి చిత్రాలకి మార్కెట్ బాగుంటుందని అంచనాలున్నాయి. మరి ఈ సినిమాతో అయినా సందీప్ హీరోగా ఒక పొజిషన్‌కి వస్తాడో లేదో చూడాలి.