తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో వంద కోట్ల షేర్ రాబట్టే తొలి చిత్రం అవుతుందని బాహుబలిపై అంతులేని అంచనాలున్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మాగ్నమ్ ఓపస్ తెలుగు సినిమా కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోతుందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారు. ఈ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందని జనం ఆశిస్తున్నారో రాజమౌళికి క్లియర్‌గా తెలుసు.
అందుకే అతను ఈ చిత్రాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోవడం లేదు. అన్ని విధాలుగా ఈ చిత్రం పర్ఫెక్ట్గా ఉండేట్టు కృషి చేస్తున్నాడు. ఈ చిత్రం బడ్జెట్ కూడా అదే లెవల్లో అవుతోందని టాక్ వినిపిస్తోంది. మొదట్లో 70 కోట్ల బడ్జెట్ అవుతుందనే అంచనా పెట్టుకున్నారని, అది ఆల్రెడీ డబుల్ అయిందని రూమర్స్ వస్తున్నాయి.
టోటల్‌గా బాహుబలి బడ్జెట్ 175 కోట్లు అవుతుందనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఇది నిజమే అయితే కనుక బాహుబలి ట్రాక్ తప్పుతున్నట్టే అనుకోవాలి. ఎంత రెండు భాగాలుగా విడుదలయ్యే సినిమా అయినా కానీ అంత బడ్జెట్‌ని రికవర్ చేసే స్టామినా తెలుగు సినిమాకి లేదని చెప్పాలి. ఈ విషయం రాజమౌళికి తెలీదని అనుకోలేం. అందుకే ఇది జస్ట్ రూమర్ అని సరిపెట్టుకోవచ్చు. ఇంతకీ ఈ సినిమా బడ్జెట్ ఎంత అవుతుందనేది ఈ పుకార్ల నేపథ్యంలో అయినా రాజమౌళి రివీల్ చేస్తాడా?