మనకు నచ్చినా నచ్చకపోయినా …..

జగన్ గారి ఆలోచనా విధానం విభిన్నంగా ఉంటుంది. అది మనకు, ఆయన పక్కనుండేవాళ్ళకే కాదు తనను పూర్తిగా ద్వేషించే పచ్చ మాఫియాకు కూడా అర్ధం కాదు. అందుకే అందరం చాలా గందరగోళపు స్థితిలో ఉంటాం!…

జగన్ గారి ఆలోచనా విధానం విభిన్నంగా ఉంటుంది. అది మనకు, ఆయన పక్కనుండేవాళ్ళకే కాదు తనను పూర్తిగా ద్వేషించే పచ్చ మాఫియాకు కూడా అర్ధం కాదు. అందుకే అందరం చాలా గందరగోళపు స్థితిలో ఉంటాం! ఈ గందరగోళపు స్థితి మనకు కొంచెం ఫ్రస్ట్రేషనిస్తుంది, కానీ పచ్చ మాఫియాకు? దిక్కుతెలియని స్థితిలో ఉన్న గొప్ప వ్యూహకర్తలమనుకునే పచ్చ బాబులదే అతిపెద్ద ఉక్కుష్టం! 

1983 నుండి రాష్ట్ర దేశ రాజకీయాలను ఏదో విధంగా శాసించిన రామోజీ, చంద్రబాబు, వెంకయ్య నాయుడు, మిగిలిన పెద్ద పచ్చ తలకాయలకు జగన్ అతిపెద్ద మేధావా లేక పిచ్చివాడా అనేది అర్ధం కావడంలేదు. 151/175, 22/25 గెలుపొక పక్క కనబడి భయపెడుతుంది. కాబోయే ప్రధాన న్యాయమూర్తిపైనే లేఖాస్త్రం సంధిస్తే ఔరా ఎంత మూర్ఖపు పనిదీ అని ఆశ్చర్యపోతారు, ఏందా తెగింపని గజ గజ వణుకుతారు. మళ్ళీ కన్ఫ్యూజన్!

పేదల కోసం వివిధ పధకాలు ప్రవేశపెడితే శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేస్తూనే మేము అధికారంలోకి వస్తే ఈ పధకాలు ఆపేస్తామనే మాట చెప్పుకోలేనంత కన్ఫ్యూజన్ పచ్చ మాఫియాకు కలిగించాడు. నాడూ నేడు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ టౌన్ క్లినిక్స్ లాంటివి ప్రజలకు బాగా ఉపయోగకరమై జగన్ గారికి మంచి పేరు తెస్తున్నాయి. 

ఇవన్నీ విప్లవాత్మకమైన చర్యలు – ఇంతవరకూ ఏ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వమూ కలలో కూడా కనీసం ఆలోచించనవి! అలాగే లిక్కర్ సిండికేట్ వెన్ను విరవడం, అమరావతి రియల్ ఎస్టేట్ కుభకోణాన్ని ఛేదించడం పచ్చ మాఫియాకున్న ప్రధాన ఆర్ధిక వనరులను దెబ్బతీసి రాజకీయాల్లో వారికున్న ఆర్ధిక పైచేయిని తగ్గించడం పచ్చ మేధావులకు మింగుడుపడనివి!

ఇవన్నీ పక్కన పెడితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినపుడు కొంతమంది వైఎస్సార్ అనుచరులను ఎందుకు తీసుకోలేదని చాలా మంది ఈరోజుకీ ఆశ్చర్యపోతారు! కేవీపీ, ఉండవల్లి, సాయి ప్రతాప్ లాంటి వాల్లను ఎందుకు తీసుకోలేదు? ఒక్కసారి గమనిస్తే వీళ్ళలో ఏ ఒక్కరూ జగన్ గారికోసం కాంగ్రెస్ మాఫియాతో పోరాడలేదు, ఇంకా ఆయన పైన పితుర్లు చెప్పడం లేనిపోనివి ప్రచారం చేయడం లాంటివి చేసారు. 

వైఎస్సార్ ఈ ముగ్గురిని పూర్తిగా మోసాడు వీళ్ళకొచ్చిన ప్రతి పదవి వైఎస్సార్ వలనే కానీ ఆయన చనిపోయాక ఆయన మీదా జగన్ గారి మీదా కేసులు పెట్టి కాంగ్రెస్ మాఫియా వేధిస్తే వీళ్ళలో ఒక్కరు కూడా జగన్ గారి పక్కన నిలబడలేదు. అందుకే జగన్ గారు వీళ్ళకు మర్యాదిస్తూనే వీళ్ళను దగ్గరకు రానివ్వలేదు. ఇంతకంటే గొప్ప రాజనీతి చూపించిన నాయకుడిని ఒక్క వైఎస్సారుని తప్ప వేరెవరిని చూడలేదు!

ఇంకో రెండు ఉదాహరణలు. గుడివాడ అమర్, విడుదల రజని. కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు లేనపుడు గుడివాడ కుటుంబం వైఎస్సార్ వర్గమే. వైఎస్సార్ గారితో గుర్నాధ రావు గారు సన్నిహితులు. పరిస్థుతుల ప్రభావంతో దారులు వేరైనా 2013లో అమర్ వచ్చి జగన్ గారితో కలిస్తే ఏకంగా అనకాపల్లి ఎంపీ క్యాండిడేటుగా డిక్లేర్ చేసారు జగన్. తరవాత విశాఖ జిల్లా ప్రెసిడెంటుగా చేసినప్పుడు నేనొక పెద్ద నాయకుడితో మాట్లాడుతున్నపుడు జగన్ ఏమి చేస్తున్నాడో ఆయనకన్నా తెలుసో లేదో అన్నాడు. 

ఇంత పిన్న వయసులో ఈరొజు ఐదు ప్రధాన శాఖలకు మంత్రిగా చేసినప్పుడు ఇంకేమీ అర్ధవుతుందో జగన్ గారి గురించి? జగన్ గారి విప్లవాత్మక రాజకీయ వ్యూహాలు సగటు రాజకీయులకు అర్ధం కావు. సింపుల్! ఎన్ని చేసినా అవసరానికి ఉపయోగపడని ముసలి నక్కలకంటే తన కోసం సర్వశ్వం ధారపోసే అమర్ లాంటి యువకులు కావాలి! ఇక విడుదల రజని. 

పార్టీలో చేరకముందు వైఎస్సార్ గారిని దృతరాష్ట్రుడని, జగన్ గారిని నరకాసురుడని పిచ్చిగా మాట్లాడితే నేను సోషల్ మీడియాలో ఇలాంటి వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించా. గెలిచిన తను పూర్తిగా నియోజకవర్గానికి పరిమితమై ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు దగ్గరై ఈరొజు మంత్రయింది.

ఇక అన్నిటికన్నా ఎక్కువగా మనల్ని కన్ఫ్యూజ్ చేసేది పచ్చ మాఫియాను ఆంధోళన పరిచేది జగన్ గారి మంత్రివర్గ కూర్పు. కమ్మ, రాజు, బ్రాహ్మిన్, వైశ్య కులాకు ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఆయన లెక్క నాకు తెలిసి –  ఈ నాలుగు కులాల ఓట్లు కలిపి 8.5%, వీళ్ళలో వైఎస్సార్సీపీకి 2019లో 2.5-3% వచ్చుంటాయి. 

నిమ్న వర్గాల ప్రధానమైన మంత్రివర్గమివ్వడం ద్వారా జగన్ గారికి ఆ నాలుగు ప్రధాన అగ్రవర్గాలలో పోయే ఒకటి రెండు శాతం కంటే చాలా ఎక్కువగా ఇటువైపునుండి లాభముంటుందని తెలుసు!

జగన్ గారికి ఈ రాజకీయ లెక్కలు బాగానే వచ్చు. ఏది ప్లస్సో ఏది మైనస్సో కూడా తెలుసు!

గురవా రెడ్డి, అట్లాంటా