సన్నీలియోన్‌ని గురించిన నగ్నసత్యాలు

నిప్పునీ అందాన్నీ వయసునీ కప్పిపుచ్చలేం. అవి మరింత రెచ్చిపోయి బయటపడిపోతాయి. సన్నీలియోన్‌ని గురించిన ఎన్నో విషయాలు ఇప్పటికే ఆసక్తిరేపుతుంటాయి. 2011లో బిగ్‌బాస్‌ 5 సిరీస్‌తో ఆమె పరిచయం అయ్యింది భారతీయులకి. జిస్మ్‌`2, రాగిణి ఎంఎంఎస్‌…

నిప్పునీ అందాన్నీ వయసునీ కప్పిపుచ్చలేం. అవి మరింత రెచ్చిపోయి బయటపడిపోతాయి. సన్నీలియోన్‌ని గురించిన ఎన్నో విషయాలు ఇప్పటికే ఆసక్తిరేపుతుంటాయి. 2011లో బిగ్‌బాస్‌ 5 సిరీస్‌తో ఆమె పరిచయం అయ్యింది భారతీయులకి. జిస్మ్‌`2, రాగిణి ఎంఎంఎస్‌ 2 చిత్రాలతో తెరంగేట్రం చేసింది బాలీవుడ్‌లో. 

సన్నీలియోన్‌ 11 ఏళ్ళకే లిప్‌ లాక్స్‌లో వున్న మజా ఏంటో తెలుసుకుందట. 14 ఏళ్ళకే కన్యత్వం కోల్పోయింది. ప్రేమ పేరుతో 2007 వరకూ మాట్‌ ఎరిక్‌సన్‌ అనే వ్యక్తితో డేటింగ్‌ చేసింది. అతన్ని వదిలేశాక 42 శృంగార చిత్రాల్లో నటించి, కొన్నిటికి దర్శకత్వం వహించింది. 19 ఏళ్ళ వయసులో పెడియాట్రిక్‌ నర్స్‌ కోర్స్‌ కూడా చేసిందట. 

సన్నీలియోన్‌ మొదట స్వలింగ సంపర్క చిత్రాల్లోనే నటించింది. 2011లో డేనియల్‌ వెబర్‌ అనే వ్యక్తిని పెళ్ళాడిన తర్వాతే పురుష సంపర్క చిత్రాల్లో కూడా నటించింది. ఇలాంటి చిత్రాల్లో నటించడానికి తన భర్త అనుమతి కూడా తీసుకుందట సన్నీలియోన్‌. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటించడంతోపాటు, బిజినెస్‌ రంగంలో కూడా సన్నీలియోన్‌ అడుగు పెట్టింది.