మన కథల్లో ఇద్దరు చింతామణులు వున్నారు. ఒకరు సుబ్బిశెట్టి చింతామణి అయితే రెండో చింతామణి తనకు నచ్చిన మగాడితో సుఖాలు తీర్చుకున్నాక అతని తలని నరికించేసేదట. అలా వందమంది మగాళ్ళకు శిరచ్ఛేదం చేయించి సహస్ర చింతామణి అయ్యింది. ఇప్పుడు తలలు నరికించడంలేదుగానీ, తలలు మారుస్తున్న సెక్సిని నయనతార వ్యవహారం కూడా అలాగే వుందంటున్నారు.
ప్రస్తుతం ఆవిడ కొత్తగా మళ్ళీ ప్రేమలో పడిందట. ఈసారి హీరోలతో పెట్టుకోకుండా దర్శకుడ్ని ఎంచుకుందట. ‘పొడాపొడి’ చిత్రానికి దర్శకత్వం వహించిన విఘ్నేష్ శివ అనే వ్యక్తి లవ్‌లో పీకలదాకా కూరుకుపోయిందట. ఆయన ప్రేమకు కానుకగా ఖరీదైన కారుని కూడా కొనిచ్చేసి, ప్రస్తుతం ఆయనతో మాల్దీవులు వెళ్ళిపోయి, కామ దీక్షలో కాలం గడుపుతుందట. నయనతార ప్రేమ పేరుతో ఎంత అల్లరి అయ్యిందో అందసరికీ తెలుసు. ఆమె పాత ప్రేమికుల లిస్టు కూడా సుపరిచితమే.
ప్రేమ రాహిత్యంతో రగిలిపోతున్న నయనతారను ఇంకెంతమంది ప్రేమిస్తారు.? ప్రతి సంవత్సరం ఓ కొత్త ప్రేమకు శ్రీకారం చుడుతున్న నయనతార అంతరంగం ఏంటో ఇప్పటికీ పాత ప్రేమికులకు కూడా అర్థం కావడంలేదు. బహుశా ప్రేమ పోరాటంలో ఆవిడ వందమంది ప్రేమికులను మార్చేసినా ఆశ్చర్యం లేదని చెప్పుకుంటున్నారు సినిమా జనం.