వయసు పిలిచాక ఎవరూ ఏం చేయలేరు

తల్లీ పిల్లా సెలబ్రిటీలైతే వండి పెట్టే దిక్కు లేదని తెలుగులో ఒక నాటు సామెత వుంది. తల్లి చేలో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? ఇలాంటి తలనొప్పులతో అతిలోక సుందరి శ్రీదేవి ఇప్పుడు సతమతమైపోతుందట. …

తల్లీ పిల్లా సెలబ్రిటీలైతే వండి పెట్టే దిక్కు లేదని తెలుగులో ఒక నాటు సామెత వుంది. తల్లి చేలో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? ఇలాంటి తలనొప్పులతో అతిలోక సుందరి శ్రీదేవి ఇప్పుడు సతమతమైపోతుందట. 

మేటర్‌ ఏంటంటే శ్రీదేవి ముద్దుల తనయ జాహ్నవిని ఇండియా గర్వించదగ్గ హీరోయిన్‌ని చేద్దామని వెయిట్‌ చేస్తుంటే, జాహ్నవి మాత్రం వయసు ఇచ్చిన పిలుపు మేరకు నైట్‌ క్లబ్స్‌కి వెళ్ళిపోయి, తెల్లవార్లూ ఫ్రెండ్స్‌తో చిందేసి, తెల్లవారుఝామున ఇంటికి చేరుకుంటుందట. ఇప్పటికే జాహ్నవి మగాళ్ళతో చీకట్లో చిందులు వేస్తున్న దృశ్యాలు చాలా లీకయిపోయి, తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారాయట. జాహ్నవికి వయసు వచ్చి ఎనిమిదేళ్ళు దాటిపోతున్నాయి. 

హీరోయిన్‌గా అవకాశాలు వచ్చినా సరే, ఇంకేవో లెక్కలు వేసి శ్రీదేవి అడ్డుకుంటుందట. ఇక ఎంతకాలం? అని జాహ్నవి కోరికలనే గుర్రాలకు కళ్ళెం వేయగలదు? పైగా వయసు ఊరికే వేళాపాళా లేకుండా పిలిచేస్తుంటుంది. దాంతో ఇక తట్టుకోలేక జాహ్నవి బంధనాలను తెంచేసిందట. ఎదిగిన పిల్ల, హై కల్చర్‌.. ఒక సాదా సీదా మద్రాసీ బ్రాహ్మణ స్త్రీలా శ్రీదేవి తన కూతుర్ని మందలించలేదు కదా. అందుకే జాహ్నవిని హీరోయిన్‌ని చెయ్యాలా? లేక ఒక బుద్ధిమంతుడికి ఇచ్చి పెళ్ళి చెయ్యాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారట శ్రీదేవి దంపతులు.