సత్యదేవ దగ్గర మరోటి వుందట

సత్యదేవ..తొలిసారి ఏకంగా బాలయ్యనే డైరక్ట్ చేసే అవకాశం సంపాదించారు. దానికి కారణం ఆయన రాసుకున్న కథ. ఆ కథ నచ్చే బాలయ్య ఆయనకు అవకాశం ఇచ్చారు. అంతకు ముందు సత్యదేవ అదే కథను పట్టుకుని…

సత్యదేవ..తొలిసారి ఏకంగా బాలయ్యనే డైరక్ట్ చేసే అవకాశం సంపాదించారు. దానికి కారణం ఆయన రాసుకున్న కథ. ఆ కథ నచ్చే బాలయ్య ఆయనకు అవకాశం ఇచ్చారు. అంతకు ముందు సత్యదేవ అదే కథను పట్టుకుని బాలయ్య అనుమతి కోసం నాలుగేళ్లు వేచి వున్నారు. మొత్తానికి సాధించారు. 

కథ బాగానే వుంది అని టాక్ వచ్చింది. సత్యదేవ దగ్గర బాలయ్యకు పనికి వచ్చే మరో అద్భుతమైన కథ వుందని టాక్. దాని పేరు సార్వభౌమ అంట. టైటిల్ బాగానేవుంది. కథ కూడా బాలయ్యకు చాలా సూటవుతుందని టాక్. మరి మరోసారి బాలయ్య అవకాశం ఇస్తే, సత్యదేవ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే.