వరుసగా భారీ డిజాస్టర్స్ ఇచ్చిన గుణశేఖర్ తనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు ఎవరూ ఆసక్తి చూపించకపోతుంటే తనే పెద్ద రిస్కుకి దిగిపోయాడు. రుద్రమదేవిలాంటి చారిత్రిక నేపథ్యమున్న చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో మొదలు పెట్టేసాడు. ఏ ధైర్యంతో స్టార్ట్ చేసాడో కానీ గుణశేఖర్ ఈ చిత్రాన్ని అయితే సకాలంలో పూర్తి చేయగలిగాడు.
ప్రస్తుతం త్రీడీ వర్క్‌తో పాటు గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సమ్మర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. కొన్ని ఏరియాల బిజినెస్ క్లోజ్ అయినా ఇంకా కొన్ని చోట్ల నెగోషియేషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. భారీ చిత్రాలకి కీలకమైన శాటిలైట్ రైట్స్ వరకు డీల్ ఆల్రెడీ క్లోజ్ అయిపోవడం మాత్రం గుణశేఖర్‌కి రిలీఫ్ ఇస్తుంది.
పెద్ద మొత్తానికే ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ని ఒక ప్రముఖ ఛానల్ దక్కించుకుందని సమాచారం. డీల్ అమౌంట్ ఎంతనేది ఇంకా డిస్‌క్లోజ్ చేయట్లేదు. విడుదలయ్యాక టాక్‌ని బట్టి లేదా పర్‌ఫార్మెన్స్‌ని బట్టి శాటిలైట్ రైట్స్ అమ్మాలని చూస్తే గుణశేఖర్‌పై పెద్ద బర్డెన్ పడేది. ముందుగా డీల్ క్లోజ్ అయిపోయింది కనుక ఇక మిగతా బిజినెస్‌పై ఫోకస్ పెట్టుకోవచ్చు.