అల్లు అర్జున్‌ ఏం మిస్సయ్యాడు?

హరీష్‌ శంకర్‌ సినిమా ఎట్టకేలకు మొదలైంది. ‘రామయ్యా వస్తావయ్యా’ తర్వాత హరీష్‌కి ఏడాదికి పైగా గ్యాప్‌ వచ్చేసింది. మిరపకాయ్‌, గబ్బర్‌సింగ్‌ తర్వాత రెడ్‌ హాట్‌గా కనిపించిన హరీష్‌ని ఒక్క ఫ్లాప్‌ బ్యాక్‌ స్టెప్‌ వేయించేసింది.…

హరీష్‌ శంకర్‌ సినిమా ఎట్టకేలకు మొదలైంది. ‘రామయ్యా వస్తావయ్యా’ తర్వాత హరీష్‌కి ఏడాదికి పైగా గ్యాప్‌ వచ్చేసింది. మిరపకాయ్‌, గబ్బర్‌సింగ్‌ తర్వాత రెడ్‌ హాట్‌గా కనిపించిన హరీష్‌ని ఒక్క ఫ్లాప్‌ బ్యాక్‌ స్టెప్‌ వేయించేసింది. తనకి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు వెనక్కి తగ్గారు… డేట్స్‌ ఇస్తామన్న హీరోలు మొహం చాటేసారు. 

అల్లు అర్జున్‌ కోసమని హరీష్‌ శంకర్‌ రాసుకున్న కథే ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’. ఈ స్టోరీ లైన్‌ విని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌ ‘రామయ్యా వస్తావయ్యా’ తర్వాత డ్రాప్‌ అయిపోయాడు. దాంతో హీరో కోసం చాలా కాలం వేచి చూసిన హరీష్‌.. ఇక స్టార్లని నమ్ముకోవడం కరెక్ట్‌ కాదని, తనే ఒక స్టార్‌ని తయారు చేయాలని డిసైడ్‌ అయ్యాడు. 

ఇంకా హీరోగా ప్రేక్షకుల నుంచి ఆమోద ముద్ర పొందని సాయి ధరమ్‌ తేజ్‌తో హరీష్‌ అదే సినిమా చేస్తున్నాడు. చాలా సార్లు ఒక హీరో మిస్‌ అయిన సినిమా వల్లే మరో స్టార్‌ పుట్టుకొస్తుంటాడు. అల్లు అర్జున్‌ ఏం మిస్‌ అయ్యాడో… సాయి ధరమ్‌ తేజ్‌ ఎలాంటి ఛాన్స్‌ కొట్టేసాడో తెలుసుకోవాలంటే ‘సుబ్రమణ్యం’ థియేటర్లలో సేల్‌కి వస్తే కానీ తెలీదు.