గబ్బర్ సింగ్ 2 అనేది ఓ బ్రహ్మ పదార్థంగా మారింది. దాని గురించి ఎవరికి తోచింది వారు, ఎవరు ఊహించింది వారు రాసుకోవడమే. వీలయినన్ని ఎక్కువ వాటిలో సారాంశం ఒక్కటే సంపత్ నంది స్క్రిప్ట్ పవన్ కు నచ్చలేదు..అందుకే వేరే డైరక్టర్ వస్తున్నారు అని. అసలు ఏమిటి నిజాలు అన్న ఆరా తీసే ప్రయత్నం చేస్తే…తెలిసిన విషయాలు.
గబ్బర్ సింగ్ స్క్రిప్ట్ 2 స్క్రిప్టు ఎప్పుడో రెడీగా వుంది బైండ్ చేసి. అందులో అక్షరం మార్చాలని పవన్ అనుకొవడం లేదు. పవన్ రాజకీయ ప్రవేశం, ఆపై గోపాల గోపాల, కాస్త అనారోగ్యం ఇలా గబ్బర్ సింగ్ 2న వెనక్కు నెట్టుకుంటూ వచ్చాయి. ఇప్పుడు కూడా ఇక అవుతుందో అవ్వదో డవుటే. కానీ బాబీని డైరక్టర్ గా ఫిక్స్ చేసినట్లు ఆయన, తన సన్నిహితులకు చెబుతున్నారు. కానీ అసలు బాబీ పవన్ ను కలవనే లేదని మరో టాక్.
రవితేజతో సినిమా చేసుకుంటానంటే ఓకే అన్నారని, ఒక వేళ గబ్బర్ సింగ్ 2 వేరేవాళ్లకి ఇచ్చినా, మరో సినిమా తనతో చేసే అవకాశం ఇస్తానని పవన్ మాటిచ్చారని సంపత్ నంది తన సన్నిహితులకు చెబుతున్నారు. హరీష్ శంకర్ మాదిరిగానే సంపత్ కూడా పవన్ బాబు దేవుడు..ఆయన మాటంటే మాట అంటున్నారు. మరి మాటంటే మాట అయినపుడు గబ్బర్ సింగ్ 2 డైరక్టర్ ఎందుకు మారాలి అంటే ఆయన దగ్గర సమాధానం లేదు.
అసలు పవన్ చేతిలో వున్నది ఒక్క సినిమా. మరీ అంత బిజీ ఏమిటంటే..రాష్ట్ర రాజకీయాలు స్టడీ చేస్తున్నారు. అయిదేళ్ల తరువాత ఆయన చేయాల్సిన కార్యక్రమాలకు ఆయన హోమ్ వర్క్ ఆయనకు వుందని సన్నిహితులు చెబుతున్నారు. పోనీ వచ్చే ఎన్నికల్లో భాజపా తరపున లేదా మద్దతుతో పవన్ పోటీకి దిగుతారనుకున్నా ఇప్పటి నుంచి కసరత్తు అవసరం లేదుకదా?
మొత్తం మీద ఇప్పటికీ గబ్బర్ సింగ్ 2 కి క్లారిటీ ఇంకా రాలేదు. కొద్ది రోజుల్లో అనౌన్స్ మెంట్ వస్తుందని దర్శకుడు బాబీ నమ్మకంగా వున్నారు. అలా వస్తే ఓకె. లేదంటే ఆ సినిమా ఇక డవుటే.