రంజిత్ మూవీస్ పతాకంపై దామోదర ప్రసాద్, దర్శకుడు తేజ కలిసి నిర్మించిన లో బడ్జెట్ సినిమా హోరాహోరీ..హీరోకి రూపాయి..హీరోయిన్ కు లక్ష ఇలా తక్కువలో తక్కువ కొటి నుంచి కోటిన్నరతో ఫినిష్ చేసేసారు. సీడెడ్, ఆంధ్ర, అమ్మాకాలతోనే ఇప్పటి రెండున్నర దాకా వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఇటీవలే ఈ ప్రాజెక్టు నచ్చి, తాను పార్టనర్ గా చేరతానంటూ వచ్చారు సురేష్ బాబు. బ్యానర్ వాల్యూ తోడవుతుంది అని ఓకె అన్నారు. కానీ ఇప్పుడు అదే నైజాంలో ఆ సినిమాకు మైనస్ అయిందని వినికిడి. సురేష్ బాబు వున్నారు కదా..నైజాంలో ఆయనే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు..మనం ఎందుకు ఎదురు వెళ్లి, ఇబ్బంది పడడం అని ఎవరూ కొనేందుకు ముందుకు రావడం లేదట.
దాంతో నైజాం సేల్ కాకుండా వుండిపోయింది. ఈ సినిమాను 11న విడుదల చేద్దాం అనుకుంటున్నారు. అయితే ఆ రోజు కొరియర్ బాయ్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం వుంది. అందువల్ల రావడమా మానడమా అని కిందా మీదా పడుతున్నారు హోరా హోరీ యూనిట్ జనాలు. మరోపక్క శాటిలైట్ కూడా ఇంకా కాలేదు. శాటిలైట్, నైజాం అయ్యేదాకా వెయిట్ చేద్దామా అన్నది కూడా మరో ఆలోచన అని తెలుస్తోంది.