ఏది ఎవరికి ప్రాప్తమో?

భలే భలే మగాడివోయ్ స్క్రిప్ట్ ను చేత పట్టుకుని దర్శకుడు మారుతి చాలా మందినే కలిసాడు. కానీ దాన్ని ఎవరూ సరిగ్గా అంచనా వేయలేకపోయారు. అందరి కన్నా ముందు సునీల్ దగ్గరకు వెళ్లింది ఆ…

భలే భలే మగాడివోయ్ స్క్రిప్ట్ ను చేత పట్టుకుని దర్శకుడు మారుతి చాలా మందినే కలిసాడు. కానీ దాన్ని ఎవరూ సరిగ్గా అంచనా వేయలేకపోయారు. అందరి కన్నా ముందు సునీల్ దగ్గరకు వెళ్లింది ఆ స్క్రిప్ట్. మాస్ మసాలా సినిమాలు చేసే మూడ్ లో వున్న సునీల్..మళ్లీ కామెడీయేనా అనేసాడు.

కాస్త అటు ఇటు చేయమని అడగడం..అలా ముందుకు వెళ్లక ఆగింది. ఆ తరువాత అల్లరి నరేష్ కు వినిపించారు. ఆయన పెద్దగా పాజిటివ్ గా రెస్పాన్స్ కాలేదని వినికిడి మధ్యలో మరో ఒకరిద్దరు పేర్లు కూడా అనుకున్నారు. అప్పటి వరకు డివివిదానయ్య నిర్మాత అనుకున్నారు. కానీ ఆయన అంత ఆసక్తి చూపించలేదు. దాంతో  ఈ ప్రాజెక్టు లైన్ విని యువి వాళ్లు లైన్ లోకి వచ్చారు. వాళ్లు నాని ని సజెస్ట్ చేసారు.

దాంతో స్క్రిప్ట్ ను నానికి తగినట్లు మళ్లీ షేపప్ చేసాడు మారుతి. అది విని అల్లు అరవింద్ జాయిన్ అయ్యారు. దీంతో సినిమాకు క్రేజ్ వచ్చేసింది. నానీని, బ్యానర్లను దృష్టిలో పెట్టుకుని మళ్లీ వెర్షన్ కొత్తగా రాసుకున్నాడు మారుతి. ఇలా పదే పదే స్క్రిప్ట్ ను పక్కాగా సెట్ చేసుకోవడం వల్ల భలేభలే మగాడివోయ్ ఇప్పుడు అంచనాలను దాదాపు చేరగలిగింది. నానికి ఎవడే సుబ్రహ్మణ్యం తరువాత మళ్లీ వెంటనే హిట్ దొరికింది.