గోపీ తెలుగుకు సెట్ అవుతాడా?

ఇటీవల తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన మరో సమస్య సరైన సంగీత దర్శకులు కరువైపోవడం. దేవీ ఫుల్ బిజీ, పైగా టాప్ లో కూర్చున్నాడు. థమన్ కు చాన్స్ ఇవ్వడం, డబ్బులుఇవ్వడమే కానీ, కొత్త ట్యూన్లు…

ఇటీవల తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన మరో సమస్య సరైన సంగీత దర్శకులు కరువైపోవడం. దేవీ ఫుల్ బిజీ, పైగా టాప్ లో కూర్చున్నాడు. థమన్ కు చాన్స్ ఇవ్వడం, డబ్బులుఇవ్వడమే కానీ, కొత్త ట్యూన్లు ఇవ్వడం కనిపించదు. అనూప్ రూబెన్స్ మంచి మ్యూజిక్ ఇస్తాడు కానీ డైరక్టర్ టేస్ట్ తోడుకావాలి.

కీరవాణి సీనియర్ అయ్యారు. ఆయన తమ్ముడు కళ్యాణ్ కోడూరి ఓ సెట్ ఆఫ్ సినిమాలకే ఓకె. జెబి తదితరులు చాలా మంది బిజీగానే వున్నారు కానీ సూపర్ ట్యూన్స్ అనేవి అంతగా వారి నుంచి రావడం లేదు. అందుకే పక్క రాష్ట్రాల కేసి మనవాళ్లు చూడడం ప్రారంభించారు.

ఇప్పుడు త్రివిక్రమ్ తన సినిమాకు అనిరుధ్ ను తెచ్చాడు. ఆ మధ్య గిబ్రాన్ ఓ సినిమా చేసాడు. అచ్చు కొన్ని సినిమాలు చేసాడు. నాగ చైతన్య ప్రేమమ్ రీమేక్ కు రాజేష్ మురుగేషన్ ను సంప్రదిస్తున్నారు. బెంగుళూరు డేస్ కు మ్యూజిక్ ఇచ్చిన గోపీ సుందర్ ను మారుతి తన భలేభలే మగాడివోయ్ సినిమాకు నియమించుకున్నాడు.

నేపథ్యసంగీతం విషయంలో మంచి మార్కులు కొట్టేసాడు. పాటలు కూడా ఫరవాలేదు. అందుకే తెలుగు నిర్మాతల చూపు గోపీసుందర్ పై పడుతోంది. త్వరలో నారా రోహిత్ సినిమా ఒకటి ప్రారంభం కాబోతోంది. దానికి కూడా గోపీ సుందర్ నే అడుగుతున్నారు. ఈ లెక్కన గోపీ సుందర్ తెలుగవాళ్లకు కొన్నాళ్ల పాటు తన సంగీతం వినిపించేలాగే వున్నాడు.