ఫ్రెండ్ షిప్ కోసం ఆ ముగ్గురు

ఈ తరం యువ నటుల మధ్య మంచి స్నేహం వుంటోంది. ఒకరి సినిమా ఫంక్షన్లకు మిగిలినవారు రావడం, ఒకరి సినిమాలో మిగిలిన వారు కనిపించడం మామూలైంది. మొన్న దొంగాటలో శింబు, నాని, సుశాంత్, ఇలా…

ఈ తరం యువ నటుల మధ్య మంచి స్నేహం వుంటోంది. ఒకరి సినిమా ఫంక్షన్లకు మిగిలినవారు రావడం, ఒకరి సినిమాలో మిగిలిన వారు కనిపించడం మామూలైంది. మొన్న దొంగాటలో శింబు, నాని, సుశాంత్, ఇలా చాలా మంది కనిపించారు. అలాగే ఇప్పుడు సుధీర్ బాబు సినిమాలో కూడా ముగ్గురు యంగ్ హీరోలు గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారు. 

నాగచైతన్య, రానా, మంచు మనోజ్, ఈ ముగ్గురూ సుధీర్ బాబు సినిమా మోసగాళ్లకు మోసగాడు సినిమాలో చిన్న చిన్నపాత్రల్లో తళుక్కున మెరియబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ ముగ్గురితో హీరో సుధీర్ కు ఉన్న సాన్నిహిత్య కారణంగా వారు ఈ పాత్రలు చేయడానికి సై అన్నారట. 

ప్రేమకథాచిత్రమ్ తరువాత సుధీర్ బాబుకు సరైన హిట్ లేదు. మరి ఇప్పుడు ఈ సినిమా కాస్త పుష్ ఇస్తుందేమో చూడాలి.