కొత్త పదాలతో పాటొచ్చింది

సినిమాల్లో, సంగీతంలోనే కాదు సాహిత్యంలో కూడా కాస్త నవ్యత కనిపిస్తోంది ఈ మధ్య. కొత్త కొత్త రచయితలు వస్తున్నారు. అలతి అలతి పదాలతో కొత్త గీతాలు అల్లుతున్నారు. అలాంటి పాట ఒకటి వచ్చింది. Advertisement…

సినిమాల్లో, సంగీతంలోనే కాదు సాహిత్యంలో కూడా కాస్త నవ్యత కనిపిస్తోంది ఈ మధ్య. కొత్త కొత్త రచయితలు వస్తున్నారు. అలతి అలతి పదాలతో కొత్త గీతాలు అల్లుతున్నారు. అలాంటి పాట ఒకటి వచ్చింది.

చావు కబురు చల్లగా సినిమా కోసం ఆ సినిమా దర్శకుడు కౌశిక్ రాసిన గీతం ఇది. కార్తికేయ-లావణ్య త్రిపాఠీ మీద చిత్రీకరించిన ఈ పాటలో కొత్త దనం క్లారిటీగా తెలుస్తోంది.

పడవై కదిలింది మనసే ఆకాశం వైపే…గొడవే పెడుతూందే నువ్వు కావాలనీ..అంటూ ప్రారంభమైన ఈ గీతంలో…కదిలే కాలాన్నడిగా..నీ చోటే పరుగాపమని, తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని అంటూ ముందుకు సాగింది.

మహరాజై మురిసానే ఆకాశదేశాన నీ మాట విన్నాక..మెరుపల్లె మెరిసానె ఆ నీలి మేఘాన..తెలిసేనా నీ దాకా..మనసావాచా మనసిచ్చాక..నీ తలరాతే మార్చేస్తా..నా చిరునామాగా అంటూ మరికొన్ని భావుకత నిండిన మాటలు చోటు చేసుకున్నాయి.

సాహిత్యం బాగున్నా, ట్యూన్ మరింత ఇన్ స్టాంట్ హుక్ గా వుంటే మరింత బాగుండేది. కాస్త టైమ్ పడుతుంది ఈ పాట జనాలకు రిజిస్టర్ కావడానికి. బహుశా సినిమాలో విజుల్స్ యాడ్ అయితే మరింత బాగుంటుందేమో?

గీతా 2 పతాకంపై నిర్మించే ఈ సినిమాకు బన్నీవాస్ నిర్మాత.