ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు ఒక్కో ఏర్పాటు జరుగుతున్నాయి. మే తరువాత సెట్ మీదకు వెళ్తుందీ సినిమా. ఇప్పటి నుంచి టెక్నీషియన్లను, నటీనటులను లాక్ చేస్తున్నారు.
హీరోయిన్ ఎవరు అన్నదే అసలు పాయింట్. కియారా అద్వానీ మీద అసలు గురి వుంది. కానీ డేట్ లు సమస్య అవుతాయేమో అని భయం.
ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా అంటే కాస్త స్టార్ కాస్ట్, కాంబినేషన్ సీన్లు ఎక్కువగా వుంటాయి. కియారా కనుక డేట్లు విచ్చలవిడిగా ఇవ్వలేక పోతే సమస్య అవుతుంది. అందుకే ఈ విషయమై ఆరా తీస్తున్నారు.
కియారా కనుక సెట్ కాకపోతే, ఇక త్రివిక్రమ్ ఆస్థాన హీరోయిన్ పూజా హెగ్డే వుండనే వుంది. రష్మిక కూడా ఓ ఆప్షన్ అనుకున్నారు కానీ కీలకంగా కియారా మీదే దృష్టి వుంది. ఒకవేళ సెట్ కాకపోతే త్రివిక్రమ్ లక్కీ హీరోయిన్ పూజా ను ఫిక్స్ చేసేస్తారు.