రాబోయే తమిళ సినిమాల్లో కార్తీ నటించిన సుల్తాన్ ఒకటి. ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. కార్తీ హోమ్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాకు కన్నన్ దర్శకుడు.
ఈ సినిమా తెలుగు హక్కులను యంగ్ బయ్యర్ వరంగల్ శ్రీను దక్కించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి 7.30 కోట్లు (జిఎస్టీ అదనం) కు వరంగల్ శ్రీను తీసుకున్నారు.
కార్తీ సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ వుండడం, రష్మిక హీరోయిన్ కావడంతో ఈ రేటు మంచి రేటే అని ట్రేడ్ వర్గాల బోగట్టా. అయితే ఇక్కడ విడుదల డేట్ నే సమస్య. ఆ సినిమా ను ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నారు.
ఆ తరువాత వారమే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వుంది. అది దిల్ రాజు స్వంత సినిమా. అంటే మళ్లీ నైజాంలో థియేటర్లు, లేపేయడాలు ఇలాంటి వ్యవహారాలు, గోల, గందరగోళం వుంటుందేమో అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
గమ్మత్తేమిటంటే అదే రోజు విడుదలవుతున్న గోపీచంద్-సంపత్ నంది సీటీమార్ సినిమా కు కూడా వరంగల్ శ్రీనునే బయ్యర్.