సూర్య టాక్‌ బానే ఉంది

రిలీజ్‌ కోసం అష్టకష్టాలు పడ్డ ఆటోనగర్‌ సూర్య ఎట్టకేలకు ఈ శుక్రవారం విడుదలవుతుందనే టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇంకా కొన్ని సందేహాలున్నాయని, ఫైనాన్స్‌ పరమైన సర్దుబాట్లు జరుగుతున్నాయని, విడుదలకి ఆటంకాలు ఉండకపోవచ్చునని విశ్వసనీయ వర్గాల…

రిలీజ్‌ కోసం అష్టకష్టాలు పడ్డ ఆటోనగర్‌ సూర్య ఎట్టకేలకు ఈ శుక్రవారం విడుదలవుతుందనే టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇంకా కొన్ని సందేహాలున్నాయని, ఫైనాన్స్‌ పరమైన సర్దుబాట్లు జరుగుతున్నాయని, విడుదలకి ఆటంకాలు ఉండకపోవచ్చునని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

ఇన్ని ఇబ్బందులు పడి, ఇంత లేట్‌ అయిన సినిమా ఇంతకీ ఎలా ఉంది? సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి టాక్‌ అయితే బాగానే వినిపిస్తోంది. ద్వితీయార్థంలో కొన్ని సీన్లు, ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. దేవా కట్టా ఈ చిత్రాన్ని ఇంటెన్సిటీతో తెరకెక్కించాడని, మాస్‌ని ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. 

ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద జనాన్ని థియేటర్లకి రాబట్టే సత్తా ఉన్న సినిమాల కొరత ఉంది కనుక ఈ టైమ్‌లో రావడం ‘ఆటోనగర్‌ సూర్య’కి ప్లస్‌ అవుతుంది. మాస్‌కి నచ్చే సినిమాలు వచ్చి కూడా బాగా గ్యాప్‌ వచ్చింది కనుక వారికి ఏమాత్రం నచ్చినా ‘ఆటోనగర్‌ సూర్య’ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేస్తుంది.