తమిళ హీరో విశాల్ కొంతకాలంగా తెలుగులో ఫ్లాపవుతున్నాడు. సక్సెస్ అయిన అతని తమిళ చిత్రాలు కూడా తెలుగులో ఫెయిలవుతున్నాయి. అందుకేనేమో… అతని గత తమిళ చిత్రాన్ని తెలుగులోకి అనువదించినా కానీ వెంటనే రిలీజ్ చేయలేదు.
తమిళనాడులో వంద రోజుల ప్రదర్శన పూర్తయ్యాక కానీ విశాల్ సినిమా ‘ఇంద్రుడు’ ఇక్కడ రిలీజ్ కాలేదు. తమిళంలో సంచలనం సృష్టించిన ఈ చిత్రంలో కొన్ని అంశాలని తెలుగులో టోన్ డౌన్ చేసి, మన వాళ్ల అభిరుచికి తగ్గట్టు ఎడిటింగ్ పరంగా మార్పులు చేసారు.
ఇంద్రుడు శుక్రవారం రిలీజ్ అయి బాగా ఆడుతోంది. గత వారం వచ్చిన సినిమాల్లో దీనికే మంచి ఓపెనింగ్ వచ్చింది. మాస్ సెంటర్స్‌లో చాలా కాలం తర్వాత మళ్లీ విశాల్ సినిమాకి సందడి కనిపిస్తోంది. తగ్గిపోయిన తన తెలుగు మార్కెట్‌కి ఈ చిత్రం కాస్త బూస్ట్ ఇస్తుంది. తదుపరి చిత్రాన్ని ఈసారి విశాల్ ఎప్పటిలా ఘనంగా విడుదల చేసుకోవచ్చు.