బాహబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలను పక్కన పెడితే ఆంధ్ర, నైజాంల్లో పుష్ప, అల వైకుంఠపురములో సినిమాలతో బన్నీ వే రికార్డులుగా వున్నాయి. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటీ చెదిరిపోతున్నాయి. వాటి స్థానాన్ని కేజీఎఫ్ 2 ఆక్రమిస్తోంది.
ఇప్పటికే నైజాంలో మూడో ప్లేస్ ను ఆక్యుపై చేసింది. ఇప్పటికీ ఇంకా హైదరాబాద్ అర్బన్ లో చాలా స్ట్రాంగ్ గా వుంది. మండే నాడు కూడా మల్టీ ఫ్లెక్స్ ల్లో కేజీఎఫ్ 2 టికెట్ లకు డిమాండ్ కనిపించింది.
ఇక ఆంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో ఫుష్ప కలెక్షన్లను కేజీఎఫ్ 2 క్రాస్ చేసేసింది. అక్కడ అలవైకుంఠపురములో రికార్డును కొట్టడం కష్టం. అది సాధ్యం కాదు. కానీ పుష్ప కలెక్షన్లు మాత్రం క్రాస్ చేసిందని ట్రేడ్ వర్గాల బోగట్టా. విశాఖ అర్బన్ లో ఇంకా రన్ బాగుంది.
ఈస్ట్ లో కూడా పుష్ప రికార్డులను కేజీఎప్ 2 దాటేసింది. అయితే ఇక్కడ ఇక రన్ పెద్దగా మిగలలేదు. వెస్ట్ లో పుష్ప కలెక్షన్లకు దగ్గరగా వచ్చింది. కానీ దాటుతుందా అన్నది అనుమానమే. గుంటూరులో నాలుగున్నర కోట్లు దాటింది.మరో యాభై అరవై లక్షలు షేర్ వస్తే పుష్ఫను దాటేస్తుంది. కృష్ణా జిల్లాలో దాదాపు దగ్గరకు వచ్చేసింది. ఈ వారాంతానికి పుష్ప కలెక్షన్లు దాటేసే అవకాశం క్లియర్ గా వుంది. నెల్లూరు లో దాటడం కష్టమే అనుకోవాలి. సీడెడ్ లో కూడా పుష్పదే రికార్డు.
మొత్తం మీద చాలా చోట్ల పుష్ప రికార్డును, నైజాంలో అలవైకుంఠపురం రికార్డును ఓ డబ్బింగ్ సినిమా దాటేయడం విశేషం.