రామ్ చరణ్ తో భవ్య సినిమా?

భవ్య సినిమా నిర్మాణ సంస్థ కాస్త జోరుమీదే వున్నట్లు తెలుస్తోంది. లౌక్యం సినిమా హిట్ అయిన తరువాత చాలా ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. మహేష్ బాబుతో 18 కోట్ల డీల్ కుదర్చుకున్నారని ఆ…

భవ్య సినిమా నిర్మాణ సంస్థ కాస్త జోరుమీదే వున్నట్లు తెలుస్తోంది. లౌక్యం సినిమా హిట్ అయిన తరువాత చాలా ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. మహేష్ బాబుతో 18 కోట్ల డీల్ కుదర్చుకున్నారని ఆ మధ్య వార్తలు అందాయి. 

గోపీచంద్ తో మరోసినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా చరణ్ సై అనలేదు. దాదాపు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లే. అంటే టాప్ హీరలతో వరుసగా సినిమాలన్నమాట. 

అవును..మరి భవ్య యూనిట్ అధినేతలు అంటే నందమూరి కుటుంబం హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటారు. మరి వారితో సినిమాలు ప్లాన్ చేయడం లేదేలనో?