రెండు కోట్లకు పైగా కోడి తినేస్తుందా?

దాగుడు మూతల దండాకోర్..ఓ కోడి చుట్టూ తిరగే కథ. ఈ సినిమాను దిల్ రాజు సుమారు రెండున్నర కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది. సినిమాకు ఏమంత గొప్ప టాక్ రాలేదు. ఎటొచ్చీ ఈటీవీకి చెందిన సినిమా…

దాగుడు మూతల దండాకోర్..ఓ కోడి చుట్టూ తిరగే కథ. ఈ సినిమాను దిల్ రాజు సుమారు రెండున్నర కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది. సినిమాకు ఏమంత గొప్ప టాక్ రాలేదు. ఎటొచ్చీ ఈటీవీకి చెందిన సినిమా కాబట్టి, పబ్లిసిటీ కుమ్మేస్తారు కనుక, కాస్త కలెక్షన్లు వుండొచ్చు. 

మరి రెండున్నర కోట్ల మేరకు వుంటాయా అన్నది అనుమానం. ఇప్పుడున్న పరిస్థితుల్లో డవుటుగానే వుంది. పైగా వారం తిరక్కుండా వరుసపెట్టి పెద్ద సినిమాల దాడి చేస్తున్నాయి. మరి ఏమవుతుందో చూడాలి. దిల్ రాజు టైమ్ కాస్త అటు ఇటుగానే వుంటోంది ఇటీవల. గంగలో వస్తోందనుకుంటే కోడి తినేసేలా వుంది.