మహేష్ ‘చెప్పు’ చేతల్లో..

థమ్స్ అప్ డ్రింక్ తాగేయడం,టీవీఎస్ బైక్ నడిపేయడం లాంటి వ్యవహారాలు అయిపోయాయి. ఇప్పుడు తాజాగా చెప్పుల జతల ప్రకటనలు కూడా పట్టేసాడు మహేష్ బాబు. అతగాడు పట్టడం అనే కన్నా, కంపెనీలో మహేష్ ను…

థమ్స్ అప్ డ్రింక్ తాగేయడం,టీవీఎస్ బైక్ నడిపేయడం లాంటి వ్యవహారాలు అయిపోయాయి. ఇప్పుడు తాజాగా చెప్పుల జతల ప్రకటనలు కూడా పట్టేసాడు మహేష్ బాబు. అతగాడు పట్టడం అనే కన్నా, కంపెనీలో మహేష్ ను వెదుక్కుంటూ వస్తున్నాయని అనవచ్చు.తెలుగు సినిమా హీరోల్లో ఈ రేంజ్ బ్రాండ్ అంబాసిడర్ మరొకరు లేరన్నది వాస్తవం. 

రామ్ చరణ్, అల్లు అర్జున్ లు చేసినా ఒకటి రెండే. ఎన్టీఆర్ కూడా అంతే. కానీ మహేష్ వ్యవహారం అలా కాదు.సినిమాల మాదిరిగా వాటినీ సీరియస్ గా తీసుకుంటున్నట్లుంది..ఒకసారి అతుక్కున బ్రాండ్ మరి చేజారడం లేదు. ఇప్పుడు పారగాన్ చెప్పుల ప్రకటనలకు కూడా మహేష్ అవసరమయ్యాడు. ఇంతకు ముందు సమంత చేసింది. ఇక మహేష్ ను పారగాన్ చెప్పులతో చూస్తామన్నమాట.