నో అంటే నో అనేసిన తమన్నా

ముగ్గురు ముద్దుగుమ్మలు బికినీలు వేసుకుని అలా నీళ్లల్లోంచి బయటకి నడిచి వస్తుంటే… ఆ సీన్‌ ఊహించుకోండి. ఊహించుకోడం దేనికి ఆల్రెడీ హౌస్‌ఫుల్‌ చిత్రంలో ఇలాంటి సీన్‌ తెరకెక్కించారు. అదే సీన్‌ని రిపీట్‌ చేయాలని చూసిన…

ముగ్గురు ముద్దుగుమ్మలు బికినీలు వేసుకుని అలా నీళ్లల్లోంచి బయటకి నడిచి వస్తుంటే… ఆ సీన్‌ ఊహించుకోండి. ఊహించుకోడం దేనికి ఆల్రెడీ హౌస్‌ఫుల్‌ చిత్రంలో ఇలాంటి సీన్‌ తెరకెక్కించారు. అదే సీన్‌ని రిపీట్‌ చేయాలని చూసిన సాజిద్‌ ఖాన్‌ ముచ్చటని తమన్నా తీర్చననేసింది. 

బిపాషా బసు, ఇషా గుప్తా హ్యాపీగా తమకి ఇచ్చిన బికినీలు వేసుకుని నటించేస్తే తమన్నా మాత్రం బికినీ వేయడానికి నో అనేసింది. సాజిద్‌ తనకి ఎంత నచ్చచెప్పాలని చూసినా కానీ తమన్నా ససేమీరా అనడంతో స్లీవ్‌లెస్‌ టాప్‌, షార్ట్‌తో కానిచ్చేసారు. ఇదే కాదు ఓ ముద్దు సీన్‌ కూడా తీయడానికి సాజిద్‌ ఖాన్‌ ట్రై చేస్తే తాను అందుకు సిద్ధంగా లేనని తమన్నా చెప్పిందట.

నటిగా తనకి కొన్ని పరిధులు ఉన్నాయని, తన ఫ్యామిలీతో కలిసి కూర్చుని సినిమా చూస్తుంటే ఇబ్బంది కలిగే సన్నివేశాలు ఎప్పటికీ చేయనని తమన్నా అంటోంది. బాలీవుడ్‌ వెళ్లాక ఇలాంటి హద్దులన్నీ చెరిపేస్తున్న తారల మధ్య తను అనుకున్నదే చేస్తున్న తమన్నాని మెచ్చుకోవాల్సిందే.