అతను…ఆమె..ఒకే ఇల్లు

నచ్చిన వారితో కలిసి వుండడం కన్నా ఆనందం ఏముంటుంది. అందుకే ఇప్పుడు ఆ స్టార్, తనకు నచ్చిన కో స్టార్ ను తన ఇంట్లోనే వుంచుకున్నాడన్నది టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్. టాలీవుడ్ లో…

నచ్చిన వారితో కలిసి వుండడం కన్నా ఆనందం ఏముంటుంది. అందుకే ఇప్పుడు ఆ స్టార్, తనకు నచ్చిన కో స్టార్ ను తన ఇంట్లోనే వుంచుకున్నాడన్నది టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్. టాలీవుడ్ లో పిచ్చ ఫాలోయింగ్ వున్న ఆ స్టార్ ఇటీవల తన కొత్త సినిమాకు ఓ అప్ కమింగ్ ఆర్టిస్ ను హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఆ అమ్మాయికి మాంచి నికార్సయిన ట్రయినింగ్ కూడా ఇప్పిస్తున్నాడని జాతీయ పత్రికలు కూడా వార్తలు ప్రచురించాయి. 

అయితే మరి ట్రయినింగ్ లో భాగమో? లేక ఎన్నాళ్లని ఓ అమ్మాయి బయట హోటళ్లంట వుండాలనో భావమో? తెలియదు కానీ, ప్రస్తుతం ఆ అమ్మాయి ఎక్కువగా ఈ హీరో ఇంట్లోనే వుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిని ఆధారం చేసుకుని, సహజీవనమో, పెళ్లో అన్న గ్యాసిప్ లు కూడా మొదలైపోయాయి. ఇలా చూస్తుంటే సినిమాల కన్నా జనాలు పెట్టే కనెక్షన్ల సంఖ్య ఎక్కువైపోతుందేమో అన్న చమత్కారాలు కూడా వినిపిస్తున్నాయి.