నేనలాంటిదాన్ని కాను: తమన్నా

‘ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం నాకిష్టం వుండదు.. నేనందరితోనూ స్నేహపూర్వకంగానే వుంటాను.. బిపాసాబసుతో కూడా అలానే నాకు మంచి స్నేహం వుంది..’ అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. బిపాసా బసు, తమన్నా కలిసి బాలీవుడ్‌ చిత్రం…

‘ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం నాకిష్టం వుండదు.. నేనందరితోనూ స్నేహపూర్వకంగానే వుంటాను.. బిపాసాబసుతో కూడా అలానే నాకు మంచి స్నేహం వుంది..’ అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. బిపాసా బసు, తమన్నా కలిసి బాలీవుడ్‌ చిత్రం ‘హమ్‌షకల్స్‌’లో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. అయితే సినిమా ప్రమోషన్‌లో బిపాసా ఎక్కడా కన్పించడంలేదు.

ఈ విషయమై చాలా గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. సినిమాలో తొలుత తనకు చెప్పిన విధంగా తన పాత్ర నిడివి లేదనీ, దానిక్కారణం తమన్నాయేనన్నది బిపాసా ఆవేదన అట. సీనియర్‌నైన తనను కాదని, తమన్నాకి చిత్ర యూనిట్‌ ఇంపార్టెన్స్‌ ఇవ్వడం పట్ల గుస్సా అయిన బిపాసా, ఆ కారణంగానే తమన్నాపై ‘కోపం’ పెంచుకుందన్న ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంపై స్పందించిన తమన్నా, ‘అదేమీ లేదు.. మేం సినిమా షూటింగ్‌ టైమ్‌లో ఫ్రెండ్లీగా వున్నాం.. ఇప్పుడు కూడా.. అయితే ఆమె ఎందుకు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదో నాకు తెలియదు..’ అని చెప్పిన తమన్నా, సాజిద్‌ఖాన్‌తో తనకు ఎఫైర్‌ వుందంటూ వస్తున్న వార్తల్నీ కొట్టి పారేసింది. ‘సాజిద్‌ నాకు సోదరుడిలాంటోడు.. ఓసారి రాఖీ కూడా కట్టాను తెలుసా..’ అంటోంది తమన్నా. అదీ సంగతి.