నరేష్ పరిస్థితి ఏమిటి?

నిన్న మొన్నటి దాకా అల్లరి నరేష్ అంటే మినిమమ్ గ్యారంటీ. సినిమా హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు కాక లేదు. ఎందుకంటే హీరో గారికి ఓ కోటి రూపాయిలు. సినిమా రెండు మూడు కోట్లు..మహా…

నిన్న మొన్నటి దాకా అల్లరి నరేష్ అంటే మినిమమ్ గ్యారంటీ. సినిమా హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు కాక లేదు. ఎందుకంటే హీరో గారికి ఓ కోటి రూపాయిలు. సినిమా రెండు మూడు కోట్లు..మహా అయితే అయిదుకోట్లతో సినిమా ఫినిష్. రిటర్న్ లు బాగానే వుండేవి.కానీ రాను రాను నరే్ష్ స్టయిల్ మారింది. సినిమా బడ్జెట్ పది దాటించే పక్షంలోనే నిర్మాతకు ఓకె. లేదంటే లేదు. 

తన రెమ్యూనరేషన్ సంగతి పక్కన పెట్టి హీరోయిన్ల సెలక్షన్ అతగాడితే. సినిమా రిచ్ గా వుండాలని కండిషన్. అయినా కూడా నిర్మాతలు ముందుకే వచ్చారు. కానీ సుడిగాడు ముందు కొన్ని, తరువాత అన్నీ ఫట్ ఫట్ మని పేలిపోయాయి. తాజగా జంప్ జిలానీ బడ్జెట్ అసలు ఎంతో తెలియదు కానీ, కాగితాల్లో 14 కోట్లని టాక్. అంత బడ్జెట్ ఏముంది ఆ సినిమాకి అని టాలీవుడ్ జనాలు కిందా మీదా అవుతున్నారు. అంత వస్తుందా అన్నది ఇప్పుడు అనుమానం. 

శాటిలైట్ బాగానే వచ్చినా, సినిమా కలెక్షన్లు అంతంతమాత్రం.  ఇప్పుడు రెండు సినిమాలు నరేష్ హీరోగా లైన్ లో వున్నాయి. ఆపై దానయ్య సినిమా ఒకటి సెట్ పైకి వెళ్లాలి. అందువల్ల నరేష్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన  ప్రమాదం ఏమీ లేదు. పైగా అమ్మిరాజు సినిమాపై చాలా నమ్మకాలున్నాయి. ఒక్కటి హిట్ కొడితే ట్రాక్ పైకి వస్తాడు.