జంప్ జిలానీ సందర్భంగా నిర్మాత అంబిక వారిని హీరోయిన్ ఇషాచావ్లా ఓ రేంజ్ లో ఇబ్బంది పెట్టిందని కృష్ణనగర్ కోడై కూస్తోంది. ఫ్లయిట్ అయితే బిజినెస్ క్లాస్ టికెట్ కావాలని, ఎకామిడేషన్ ఫైవ్ స్టార్ అయితేనే ఓకె అన్నివి ఆ ఇబ్బందుల్లో కొన్ని అని వినికిడి.
అంతే కాదు. తనకు ఓ బాడీ గార్డు, ప్లస్ సంబంధీకుల కొందరు, అందర్నీ నిర్మాత భరించాల్సిందే అని గుసగుస. ఇన్ని భరించి తీసుకోవడానికి ఆ అమ్మడి స్పేషాలిటీ ఏముందా అని ఇప్పుడు సినిమా జనాలు అంబికా వారిని ఎదురు ప్రశ్నిస్తున్నారట. అయిపోయింది ఏదో అయిపోయింది. మరింక ఈ సంగతులు నిజమని తెలిస్తే, మరి ఏ నిర్మాత మాత్రం ధైర్యం చేస్తాడు..ఇషా చావ్లాకు చాన్సివ్వడానికి?