ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఖరారు కావడం, దాని తర్వాత వంశీ పైడిపల్లితో ఒకటి, వక్కంతం వంశీతో మరోటి చేస్తాడని వార్తలు రావడంతో ఇక సుకుమార్ సినిమా లేనట్టేనని ఫిక్స్ అయిపోతున్నారు. సుకుమార్‌తో సినిమా చేస్తానని మాటిచ్చిన ఎన్టీఆర్ దానిని మర్చిపోయాడా? సుకుమార్‌తో ప్రయోగానికి అతను సిద్ధంగా లేడా?
ఇప్పటికీ ఎన్టీఆర్ అదే మాట మీదున్నాడని విశ్వసనీయంగా తెలిసింది. సుకుమార్ కథ మీదే చాలా టైమ్ స్పెండ్ చేస్తాడు కనుక ఈ టైమ్‌లో ఎన్టీఆర్ వేరే కమిట్మెంట్స్ పెట్టుకుంటున్నాడే తప్ప సుకుమార్ చిత్రాన్ని పక్కన పెట్టలేదు. సుకుమార్ ఎప్పుడు కథ రెడీ అంటే అప్పుడు ఆ సినిమా స్టార్ట్ అయిపోతుందట.
అలాగే సుకుమార్‌కి నిదానంగా తీసే అలవాటుంది కనుక ఎన్టీఆర్ అతడిని తొందర పెట్టాలని అనుకోవడం లేదు. అతని సినిమాకి ఎన్ని డేట్స్ అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అదే సమయంలో తన సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ రాకుండా వేరే సినిమాలు కూడా సైమల్టేనియస్‌గా చేయబోతున్నాడు. అందుకే తన కొత్త కమిట్మెంట్స్లో ఏదీ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ బ్యానర్లో చేయడం లేదు. ఆ బ్యానర్‌పై ఎన్టీఆర్ చేసే సినిమాకి సుకుమారే దర్శకుడు.