ఇండస్ట్రీలో తెర వెనుక చాలా కబుర్లు వినిపిస్తుంటాయి. ఈ కబుర్లు ఆయా నటీనటులు, సాంకేతిక నిపుణుల కెరియర్ పై ప్రభావం చూపిస్తుంటాయి కూడా. ఉయ్యాల జంపాల సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు రాజ్ తరుణ్. మళ్లీ ఇంతవరకు మరో సినిమా రాలేదు. దానిపై చాలా కబుర్లు వినిపిస్తున్నాయి.
రాజ్ తరుణ్ చెప్పే షరతులు విని నిర్మాతలు పారిపోతున్నారని. కోటి రూపాయిలు రెమ్యూనిరేషన్ అడగడం ఒకటి. నిజానికి అది పెద్ద సమస్య కాదు. కానీ స్క్రిప్ట్ తనకు ఇవ్వాలని, తాను దాన్ని తిరిగి సెట్ చేసి, తన డైలాగ్ పార్ట్ రాసి ఇస్తానని అంటున్నాడని టాక్. అలాగే రాజ్ తరుణ్ ఓ అమ్మాయితో డీప్ లవ్ లో వుండి కెరియర్ పట్టించుకోవడం లేదనీ టాక్.
ఇవన్నీ ఎంతవరకు నిజమో తెలియదు కానీ, తొలిసినిమా అవకాశం ఇచ్చిన రామ్ మోహన్ కు మరో సినిమా చేయాల్సి వుంది. అది కూడా ఇంకా మెటీరియలైజ్ కాలేదు. రామ్ మోహన్ కూడా రాజ్ తరుణ్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలుస్తోంది. కొన్నాళ్లాగితే నిజాలన్నీ బయటకు వస్తాయి.