సినిమా జనాలు తమపై గ్యాసిప్ లు వస్తే గుర్రు మంటారు. తమకు నచ్చేవైతే ఓకె. లేదంటే ఇలా. అంతకు మించి ప్రమేయం వుండదు. కానీ దర్శకుడు హరీష్ శంకర్ స్టయిల వేరని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన గురించి తానే ఫీలర్లు వదుల్తుంటాడట. రామయ్యా వస్తావయ్యా తరువాత పనేం లేకుండా అయింది. అందుకే తనకు తెలిసిన వారి ద్వారా ఫీలర్లు ఇస్తూ, అవకాశాల కోసం ట్రయ్ చేయడమన్నది అతగాడి కొత్త రూట్ అని కృష్ణానగర్ లో వినిపిస్తున్న తాజా ఖబర్.
గతంలో గబ్బర్ సింగ్ 2 ప్రాజెక్టు హరీష్ చేతిలోకి వచ్చిందని రూమర్ వినిపించింది. కానీ అది కాస్తా తుస్సుమంది. ఇప్పుడు కత్తి రీమేక్ చేస్తే హరీష్ నే డైరక్టర్ అంటూ మరోటి. పాపం, ఎప్పుడు ఓ పెద్ద హీరోను డైరక్ట్ చేసి ఫామ్ లోకి వచ్చేద్దామా అని వుంది హరీష్ కు.
కానీ ఆ అవకాశమే రావడం లేదు. ఎన్టీఆర్ ఇవ్వరు. మహేష్ డైరీ ఖాళీ లేదు. బన్నీ కూడా అంతే. మిగిలింది రామ్ చరణ్, పవన్. వాళ్లు కూడా ఇచ్చే అవకాశాలయితే కనుచూపు మేరలో లేవు. రవితేజనే ఆదుకోవాలేమో? లేదా గురువు రామ్ గోపాల్ వర్మ మాదిరిగా కిందకు దిగి మిడిల్ రేంజ్ హీరోలతో సరిపెట్టుకోవాలి. ఇప్పటికే స్టార్ హంట్ స్టార్ట్ చేసారుగా దిల్ రాజు సినిమా కోసం. అదే బెటరేమో?