షారుక్ ఖాన్ ‘హ్యాపీ న్యూ ఇయర్’ మొదటి రోజే నలభై కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లని ఇండియాలోనే సాధించి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఫస్ట్ వీకెండ్లోనే వంద కోట్ల మైలురాయిని చేరుకున్న ఈ చిత్రం టాక్‌కి అతీతంగా బ్లాక్‌బస్టర్ అయిపోతుందా అని అనుకుంటూ ఉండగానే… కలెక్షన్స్‌లో భారీ డ్రాప్ కనిపిస్తోంది.
సోమవారం వసూళ్లు అన్ని చోట్లా నలభై శాతానికి పడిపోగా, మంగళవారం కలెక్షన్స్ కూడా వీక్‌గానే ఉన్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి ఈ చిత్రం రెండు వందల కోట్ల మైలురాయిని చేరుకుంటుందా? ఈ చిత్రం అదృష్టం కొద్దీ రెండవ వారంలో పోటీనిచ్చే పెద్ద సినిమా ఏదీ విడుదల కావడం లేదు. కనుక సెకండ్ వీకెండ్ కూడా నలభై కోట్ల రేంజ్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అంటే రెండొందల కోట్ల డొమెస్టిక్ గ్రాస్ కలెక్షన్స్ పాజిబుల్ అనిపిస్తోంది. షారుక్ ఖాన్ కూడా ప్రమోషన్ యాక్టివిటీస్ పెంచేసాడు. సినిమాలో లేని కొత్త పాట ఒకటి రిలీజ్ చేసాడు. ఈ చిత్రాన్ని కూడా రెండొందల కోట్ల క్లబ్లో చేర్చడానికి షారుక్ ఖాన్ తన మార్కెటింగ్ గిమ్మిక్స్ అన్నీ వాడేస్తున్నాడు.