మంచు మనోజ్ తో దశరథ్ సినిమా

మాంచి ఫ్యామిలీ సినిమాలు తీయగలడు అన్న పేరున్న దర్శకుడు దశరథ్ మరోసారి మాస్ హీరో మంచు మనోజ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు.గతంలో శ్రీ అనే సినిమా చేసారు ఈ ఇద్దరు. ఆ తరువాత…

మాంచి ఫ్యామిలీ సినిమాలు తీయగలడు అన్న పేరున్న దర్శకుడు దశరథ్ మరోసారి మాస్ హీరో మంచు మనోజ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు.గతంలో శ్రీ అనే సినిమా చేసారు ఈ ఇద్దరు. ఆ తరువాత మనోజ్ రకరకాల పాత్రలు చేస్తూ, తనను తాను ప్రూవ్ చేసుకునే దిశగా వెళ్తున్నాడు. 

దశరథ్ గ్రీకు వీరుడు తరువాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల సూర్య వెర్సస్ సూర్య సినిమాను నిర్మించిన శివకుమార్ తన రెండో సినిమాగా దశరథ్-మనోజ్ కాంబినేషన్ ను ఎంచుకున్నాడు. 

ఇదిలా వుంటే ఈ నెలలోనే మనోజ్ పెళ్లి. వచ్చే నెల నుంచి ఈసినిమా సెట్ మీదకు వెళ్తుంది. ఓ ఇంటివాడవుతున్న తరుణంలో మనోజ్ కు ఫ్యామిలీ సినిమా వస్తోందన్నమాట